Saturday, January 18, 2025
Homeసినిమాసంక్రాంతి బరిలో 'ఏజెంట్'

సంక్రాంతి బరిలో ‘ఏజెంట్’

అఖిల్ అక్కినేని,  సురేందర్ రెడ్డి కాంబినేషన్లో భారీ అంచనాలున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్‘ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ‘ఏజెంట్’ 2023 సంక్రాంతికి విడుదల కానుంది. విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. గూఢచారిగా యాక్షన్-ప్యాక్డ్ రోల్ లో కనిపించబోతున్న ఈ చిత్రం కోసం అఖిల్ మేకోవర్ అద్భుతంగా వుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో అఖిల్ సూట్‌లో స్లిక్ అండ్ మోడరన్ గా ఆకట్టుకున్నాడు.

అఖిల్ స్టైలిష్ అండ్ డైనమిక్ రోల్‌లో కనిపించనున్న ఈ సినిమా టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ విడుదలైన తర్వాత అంచనాలు మరింత భారీగా పెరిగాయి. సాక్షి వైద్య అఖిల్ కు జోడిగా నటిస్తుండగా, మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రసూల్ ఎల్లోర్ కెమరామెన్ గా హిప్ హాప్ తమిళ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్‌ టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాల పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.

Also Read : ఏజెంట్ లో గాడ్ ఎవ‌రు..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్