Saturday, January 18, 2025
HomeTrending NewsFree Power: వరంగల్ డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నాం - మానిక్ రావ్ ఠాక్రే

Free Power: వరంగల్ డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నాం – మానిక్ రావ్ ఠాక్రే

తేలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుందని ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే వెల్లడించారు. రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఏమి చెప్పిందో అవి అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను రైతులకు అందిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ గాంధి భవన్ లో విలేఖరులతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీ ఆర్ ఎస్ నాయకులు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అవాస్తవాలు ప్రచారం చేస్తోందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారాయన.. వాస్తవాలు ప్రజలకు తెలుసని, కేసీఆర్ పాలన అవినీతి, అక్రమాలతో మునిగిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి వాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని, రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ రైతుల గురించి స్పష్టంగా చెప్పారని మరోసారి వెల్లడించారు ఠాక్రే…. కేసీఆర్ రైతులకు రుణమాఫీ ఎందుకు చెయ్యలేదో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీని ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామని ప్రకటించారాయన.

RELATED ARTICLES

Most Popular

న్యూస్