Sunday, November 24, 2024
HomeTrending Newsఢిల్లీలో విద్యాసంస్థలు ప్రారంభం

ఢిల్లీలో విద్యాసంస్థలు ప్రారంభం

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 321 చేరినట్లు అధికారులు తెలిపారు. పొగ మంచులా వాయు కాలుష్యం కమ్మేసిందన్నారు. నోయిడా 354, గురుగ్రామ్ 326, ధీర్పూర్ 339, ఢిల్లీ యూనివర్సిటీలో 336 గా ఈ రోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదు అయింది.  ఇప్పటికే వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీలో స్కూల్స్ కు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు.

అయితే రేపటి నుంచి స్కూల్స్ రీ ఓపెన్ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాయు కాలుష్యం కాస్త తగ్గడంతో స్కూల్స్ తెరుస్తున్నట్లు తెలిపింది. రెండు రోజుల నుంచి చూస్తే ఎయిర్ క్వాలిటి మెరుగ్గా ఉందన్నారు. రెండు రోజుల క్రితం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 326 ఉండగా ఇవాళ 321 నమోదైంది. అలాగే ప్రభుత్వ సంస్థలు కూడా ఓపెన్ కానున్నాయి. ప్రస్తుతం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్