Saturday, January 18, 2025
Homeసినిమా'హాస్టల్ డేస్'కి ప్రత్యేకమైన ఆకర్షణ ఈ బ్యూటీనే! 

‘హాస్టల్ డేస్’కి ప్రత్యేకమైన ఆకర్షణ ఈ బ్యూటీనే! 

ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లకు విపరీతమైన ఆదరణ పెరిగిపోతోంది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను వేయడం వలన వచ్చే గుర్తింపు కంటే, వెబ్ సిరీస్ లో మంచి రోల్ పడితే చాలు ఒక రేంజ్ లో  క్రేజ్ వచ్చేస్తోంది. చాలా తక్కువ సమయంలో ఎక్కువమందికి కనెక్ట్ అవుతున్నారు. ఆ తరువాత  వరుస వెబ్ సిరీస్ లతో బిజీ అవుతున్నారు. వెబ్ సిరీస్ స్టార్స్ గా కూడా మార్కులు  కొట్టేస్తున్నారు. అలాంటివారి జాబితాలో తాజాగా ఐశ్వర్య కూడా ఒకరుగా కనిపిస్తోంది.

ఐశ్వర్య ఇంతకుముందు ‘విందుభోజనం’ .. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ అనే సినిమాలలో మెరిసింది. అయితే అవి ఆమెకు గుర్తింపు తెచ్చేంత పాత్రలు కాదు. అలాంటి ఐశ్వర్యకి ‘హాస్టల్ డేస్’ వెబ్ సిరీస్ లో మంచి రోల్ పడింది. హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ నిన్నటి నుంచే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ .. వాళ్ల హాస్టల్ లైఫ్ స్టైల్ ను ఆవిష్కరించే వెబ్ సిరీస్ ఇది. 5 ఎపిసోడ్స్ తో కూడిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు అందుబాటులో ఉంది.

ఇంటిపట్టున ఉన్నప్పుడు ఆడపిల్లలపై తల్లిదండ్రుల ఆంక్షలు ఉంటాయి. అలాంటి అమ్మాయి వాళ్లకి దూరంగా హాస్టల్లో ఉన్నప్పుడు ఎలాంటి స్వేచ్ఛను కోరుకుంటుంది? ఎలా ప్రవర్తిస్తుంది? అనే పాత్రను ఐశ్వర్య పోషించింది. క్రమశిక్షణలో పెట్టడం వేరు .. కంట్రోల్ చేయడం వేరు అనేది ఆమె వాదన. అలా ఆలోచించే కావ్య పాత్రను ఐశ్వర్య బాగా చేసింది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ఈ వెబ్ సిరీస్ కి ఆమెనే ప్రత్యేకమైన ఆకర్షణ. భవిష్యత్తులో ఆర్టిస్టుగా ఆమె మరింత బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్