Mahi-Aish: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రానుందనే విషయం తెలిసిందే. ఈ క్రేజీ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 2023 జనవరి నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనేది ప్లాన్. ఇదిలా ఉంటే.. రాజమౌళి తన సినిమాల్లో చిన్న పాత్రకు కూడా హేమాహేమాల్ని రంగంలోకి దింపుతారు.
అలాంటి మహేష్ బాబుతో సినిమా. అందులో హీరోయిన్ అంటే.. ఎవర్ని ఫిక్స్ చేస్తారని ఆసక్తిగా మారింది. ఆమధ్య సాహో హీరోయిన్ శ్రద్ధాకపూర్ ని ఫైనల్ చేశారని వార్తలు వచ్చాయి. తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ ని ఫైనల్ చేశారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదే కనుక నిజమైతే.. ఈ సినిమాకి మరింత క్రేజ్ రావడం ఖాయం అంటున్నారు సినీ జనాలు. ఈమధ్య ఆమె సినిమాల్లో నటించకపోయినా.. పాపులారిటి ఏమాత్రం తగ్గలేదు.
ఆమెకు సంబంధించిన చిన్న వార్త కూడా జాతీయ స్థాయిలో పెద్దగా హల్ చల్ చేస్తుంటుంది. అలాంటి అందాల తార మహేష్ బాబు సరసన నటిస్తే.. మామూలుగా ఉండదు. థియేటర్లు దద్దరిల్లిపోతాయ్. మరి.. ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందో..? లేదో..? అసలు ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.
Also Read : మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ ప్లానింగ్ మారిందా?