Friday, February 28, 2025
HomeసినిమాAishrarya Rajesh: పుకార్లు ఆపండి: ఐశ్వర్య వినతి

Aishrarya Rajesh: పుకార్లు ఆపండి: ఐశ్వర్య వినతి

అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్పఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. రష్మిక కు కూడా ఈ సినిమా మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసి నేషనల్ క్రష్ అనే పేరు కూడా సంపాదించింది.

ఇదిలా ఉంటే..  ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ఫర్హానా ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుండి సైతం మంచి ప్రసంశలు అందుకుంది. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పలు భాషల్లో విడుదలైంది. తాజాగా సినిమా ప్రమోషన్స్ సమయంలో, తెలుగులో ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారని మీడియా ప్రతినిధి ఒకరు ఆమెను ప్రశ్నించారు. కాగా తాను పుష్పలోని శ్రీవల్లి వంటి పాత్రలకు బాగా సూటవుతానని.. అలాంటి పాత్రలు చేయాలి అనుకుంటున్నానని ఐశ్వర్య తెలిపారు.

ఇక అప్పటి నుంచి పుష్పలో రష్మిక పాత్రని ఐశ్వర్య కించపచారని కొందరు ఆమె మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం మొదలెట్టారు. ఇది గమనించిన ఐశ్వర్య రాజేష్ తన వ్యాఖ్యల పై ఒక లెటర్ ద్వారా వివరణ ఇచ్చారు. నిజానికి రష్మిక మందన్న, తోటి నటులు, నటీమణులందరిపై తనకు ప్రగాఢమైన అభిమానం ఉందని.. దయచేసి ఇలాంటి  పుకార్లను పుట్టించద్దు. ఈ పుకార్లను ఆపాలని ఐశ్వర్య రాజేష్ తన ప్రకటన ద్వారా కోరారు. ఇప్పుడు ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్