Sunday, January 19, 2025
HomeసినిమాMangalavaram: మళ్లీ పాయల్ ను రంగంలోకి దింపిన అజయ్ భూపతి!

Mangalavaram: మళ్లీ పాయల్ ను రంగంలోకి దింపిన అజయ్ భూపతి!

అజయ్ భూపతి పేరు వినగానే ఆయన నుంచి వచ్చిన ‘RX 100’ సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ .. ఎమోషన్ .. రొమాన్స్ ను ఆయన నడిపించిన తీరుకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా రొమాన్స్ కి సంబంధించిన సన్నివేశాలను తెరపై ఆయన ఆవిష్కరించిన తీరుకు యూత్ ఫిదా అయ్యారు. రిపీట్ ఆడియన్స్ కారణంగా ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాతో పాయల్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని అజయ్ భూపతి ‘మహా సముద్రం’ సినిమాను చేశాడు. మల్టీ స్టారర్ గా ఈ సినిమాను తెరకెక్కించినప్పటికీ, ఆశించిన స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంటులోనే తనకి మరోసారి ఛాన్స్ ఇవ్వమని అజయ్ భూపతిని కార్తికేయ అడిగాడు. దాంతో మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సారి ఆయన పాయల్ కి మాత్రమే ఛాన్స్ ఇచ్చారు.

పాయల్ ప్రధానమైన పాత్రగా .. 1990ల నాటి కాలంలో నడిచే కథతో ఆయన ‘మంగళవారం’ అనే సినిమాను చేశాడు. ఈ సినిమాకి సంబంధించి ఆమె పోస్టర్ ను నిన్ననే వదిలాడు. పాయల్ అందాలను చూడాలా? కళ్లలో నీళ్లు నింపుకున్న ఆమె ఆవేదనను చూడాలా? అనేది ఈ పోస్టర్ చూసినవారికి అర్థం కాలేదు. పైగా ఈ సినిమాలో ఆమె డీ గ్లామర్ రోల్ చేసిందనే విషయం కూడా అర్థమైపోతోంది. ఇక జోనర్ ను కూడా సస్పెన్స్ లో పెట్టడంతో, ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ఈ అంచనాలు ఎంతవరకూ వెళతాయనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్