‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ అజయ్ భూపతి. ఆతర్వాత ‘మహా సముద్రం’ అనే విభిన్న కథా చిత్రాన్ని తెరకెక్కించాడు కానీ.. బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ఇప్పుడు ‘మంగళవారం’ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో వస్తున్నాడు. ఇందులో పాయల్ రాజ్ ఫుట్ ప్రధాన పాత్ర పోషించింది. మంగళవారం అంటూ టైటిలే కొత్తగా ఉంది ఇక సినిమా ఇంకెంత కొత్తగా ఉంటుందో అనే టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 17న రిలీజ్ చేస్తున్నారు.
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘మంగళవారం’. ఈ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ఎవరు మంచి? ఎవరు చెడు? అనేది కనిపెట్టలేని విధంగా కథనం ముందుకు వెళుతుందని… క్యారెక్టర్స్ మీద బేస్ చేసుకుని తీసిన సినిమా అని.. పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ చూస్తే షాక్ అవుతారు అని దర్శకుడు అజయ్ భూపతి తెలియచేశారు. దర్శకుడు ఈ సినిమా గురించి ఇలా చెప్పడంతో మరింత ఆసక్తి ఏర్పడింది. థియేటర్లలో ప్రేక్షకులకు డిఫరెంట్ థ్రిల్ అందించే సినిమా ఇదని.. ఖచ్చితంగా సక్సెస్ సాధించడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు.
అజయ్ భూపతి ‘ఆర్ఎక్స్ 100’లో తెలుగులో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు ‘మంగళవారం’తో కూడా సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తారు. ఇదొక డిఫరెంట్ అటెంప్ట్. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ ట్రై చేయని విధంగా ఆయన సినిమా తీశారు. నవంబర్ 17న థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఆ మాటే చెబుతారని నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ తెలియచేశారు. మరి.. ‘మంగళవారం’ సినిమా మరో ‘ఆర్ఎక్స్ 100’ అవుతుందేమో చూడాలి.