Monday, May 20, 2024
HomeసినిమాTuntari: అజిత్ ఇక ఆలోచన చేయవలసిందే!

Tuntari: అజిత్ ఇక ఆలోచన చేయవలసిందే!

Mini Review: తమిళనాట అజిత్ కి ఉన్న క్రేజ్ ను గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసిన పనిలేదు. కేవలం లవర్ బాయ్ గా తనకి ఉన్న ఇమేజ్ చట్రంలో నుంచి బయటపడుతూ, మాస్ యాక్షన్ హీరోగాను మార్కులు కొట్టేశాడు. ఆయన సినిమాలు టీజర్ దగ్గర నుంచే కొత్త రికార్డులను నమోదు చేస్తూ వెళుతుంటాయి. అలాంటి అజిత్ తాజా చిత్రంగా ‘తునివు’ ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోనీ కపూర్ నిర్మాణంలో .. హెచ్.వినోత్ దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కింది.

సినిమా అనేది అన్ని వర్గాల ప్రేక్షకులకు ఒక వినోద సాధనం. అందువలన సినిమా నుంచి వాళ్లు అన్నిరకాల అంశాలను .. మసాలాలను కోరుకుంటారు. అలాగే కథ ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి చకచకా మారిపోతుండాలి. ఒకేచోట ఎక్కువసేపు నడిచే కథలను చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడరు. కానీ వాళ్ల ఇష్టంతో పనిలేకుండా తెరకెక్కిన స్టైలీష్ యాక్షన్ మూవీనే ‘తునివు’. తెలుగులో ఈ సినిమాను ‘తెగింపు’ టైటిల్ తో రిలీజ్ చేశారు.

బ్యాంకు దోపిడీకి పక్కాగా ప్లాన్ చేసుకున్న ఒక గ్యాంగ్ ఊహించని విధంగా లోపలికి చొరబడుతుంది. ఆల్రెడీ అప్పటికే అక్కడ మాటు వేసిన హీరోను చూసి ఈ గ్యాంగ్ షాక్ అవుతుంది. ఈ గ్యాంగ్ ను హీరో తన దారికి తెచ్చుకునేలోగా, మరో గ్యాంగ్ బయటపడుతుంది. మిగతా రెండు గ్యాంగుల వెనుక ఎవరున్నారు? బ్యాంకులో రహస్యంగా దాచబడిన 25 వేల కోట్లను ఎవరు దక్కించుకుంటారు? అనేదే కథ.

కథ అంతా కూడా బ్యాంక్ భవనంలోనే నడుస్తూ ఉంటుంది. యాక్షన్ వెనుక ఉన్న ఎమోషన్ కనెక్ట్ కాదు. లవ్ .. రొమాన్స్ .. డ్యూయెట్లకు అవకాశం లేని కథ ఇది. ఇక కామెడీ జోలికి కూడా డైరెక్టర్ ఏ పాత్రని వెళ్లనివ్వలేదు. ఒక్క యాక్షన్ ను నమ్ముకునే సినిమా నడుస్తూ ఉంటుంది. బాంబుల మోత .. తూటాల మోత తప్ప మరేమీ లేదు. అజిత్ ను స్టైలీష్ గా చూపించారు .. భారీ స్థాయిలో ఖర్చు చేశారు. అందువలన ప్రయోజనం ఏమీ కనిపించదు. ఇకనైనా అజిత్ కథలను ఓకే చేసే ముందు కాస్త ఆలోచన చేయవలసిందే .. రూటు మార్చవలసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్