Sunday, February 23, 2025
Homeసినిమా‘రొమాంటిక్’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్

‘రొమాంటిక్’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న‌ రొమాంటిక్ డ్రామా ‘రొమాంటిక్’. ఈ చిత్రానికి పూరి శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహించారు. పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. ఈ రోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.

ఈ సంద‌ర్భంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ “ రొమాంటిక్ ట్రైలర్ నిజంగానే రొమాంటిక్‌గా ఉంది. ఆకాష్ అద్భుతంగా నటించాడు. డైరెక్టర్ అద్భుతంగా తెర‌కెక్కించారు. పదేళ్ల అనుభవం ఉన్నట్టుగా, స్టార్ స్టేటస్ వచ్చినట్టుగా లాస్ట్ షాట్‌లో అద్బుతంగా అనిపించాడు. ఆకాష్‌ మొదటి సినిమాకు ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయ్యాడు. హీరోయిన్‌ అందరికీ ఈజీగా రీచ్ అవుతుంది. రమ్యకృష్ణ గారు ఎప్పటిలానే అద్భుతంగా నటించారు. అందరూ అక్టోబర్ 29న‌ ఈ సినిమాను చూడండి. చిత్రయూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.

పూరి జగన్నాథ్ మాట్లాడుతూ “డార్లింగ్ ప్రభాస్ ఈ మూవీ ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. సినిమా విడుదల చేస్తున్నామని తెలిశాక ప్రభాస్ ఫోన్ చేసి మరీ పదే పదే అడిగారు. సినిమా గురించి ట్వీట్ వేయాలా? పోస్ట్ చేయాలా? ఏదైనా ఇంటర్వ్యూ ఇవ్వాలా? ఈవెంట్‌కు రావాలా? అంటూ ఫోన్ చేసి మరీ అడిగాడు. ప్రభాస్ అంత మంచి వాడు” అన్నారు.

ఛార్మీ మాట్లాడుతూ “రొమాంటిక్ ట్రైలర్‌ను ప్రభాస్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ సర్ ప్రైజింగ్‌గా ఉండబోతోంది. డార్లింగ్ అంటూ ఓ పాట రానుంది. సినిమాలో రమ్యకృష్ణ గారు అద్భతంగా నటించారు. వీఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అనిల్.. ఈ మూవీ అద్భుతంగా తెరకెక్కించాడు. ఆకాష్, కేతిక శర్మ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఎక్కడికి వెళ్లినా కేతిక గురించి అడుగుతుంటారు” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్