Saturday, April 20, 2024
Homeసినిమాశనివారం ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

శనివారం ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Akhanda – Pre-release:
నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ, ఊర‌ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ‘అఖండ‌’. ఈ చిత్రాన్ని మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మించారు. బాల‌య్య స‌ర‌స‌న ప్ర‌గ్యా జైస్వాల్ న‌టించింది. ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ చేసిన టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్ కు ట్ర‌మెండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై అంచ‌నాలు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ‘అఖండ’ అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 2న థియేటర్లలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీగా ఉంది.

అయితే.. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ముహుర్తం ఖ‌రారుచేశారు. ఈ ఈవెంట్ ను నవంబర్ 27న గ్రాండ్‌గా చేయ‌నున్నారు. హైద‌రాబాద్ లోని శిల్పక‌ళావేదిక‌లో సాయంత్రం 6.30 నుంచి ఈ ఈవెంట్ భారీగా జ‌ర‌గ‌నుంద‌ని తెలియ‌చేస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మొత్తం టీమ్‌తో పాటు, ఈవెంట్‌ను మరింత ప్రత్యేకంగా చేయడానికి పలువురు సినీ ప్ర‌ముఖులు ఈ వేడుకకు విచ్చేయనున్నారు.

బాల‌య్య‌, బోయ‌పాటి క‌లిసి సింహా, లెజెండ్ చిత్రాలు చేయ‌డం.. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్స్ అవ్వ‌డంతో ‘అఖండ’ కూడా అదే స్ధాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని టీమ్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉంది.

Also Read : బాల‌య్య అఖండ సెన్సార్ పూర్తి

RELATED ARTICLES

Most Popular

న్యూస్