Sunday, January 19, 2025
Homeసినిమాఅఖిల్, సురేందర్ రెడ్డి అలా చేశారా..?

అఖిల్, సురేందర్ రెడ్డి అలా చేశారా..?

అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’. ఇందులో అఖిల్ కు జంటగా సాక్షి వైద్య నటిస్తుంది. కీలక పాత్రలో మమ్ముట్టి నటిస్తుండడం విశేషం. భారీ చిత్రాల నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ అండ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. దీనికి అనూహ్యమైన స్పందన రావడంతో ఏజెంట్ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న ఏజెంట్ మూవీని ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.

అయితే.. ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే బాగా పెరిగింది. మొదట 35కోట్లు బడ్జెట్ అనుకున్నారు. ఆతర్వాత 45 కోట్లు అయ్యింది. ఆతర్వాత 50 కోట్లు ఈ సినిమా అలా పెరుగుతూ వెళ్ళింది. రెట్టింపు బడ్జెట్ కు చేరుకుంది. దాదాపు 90 కోట్లు బడ్జెట్ అయ్యింది. అసలే అఖిల్ టైర్ -2 హీరో. ఒక టైర్ -2 హీరో మీద ఇంత బడ్జెట్ పెట్టడం బహుశా ఇదే తొలిసారి అయి ఉంటుంది. అయితే.. ఇది రిస్క్ అనే టాక్ వినిపిస్తోంది. ఇంత బడ్జెట్ పెట్టి తీసిన సినిమా అఖిల్ మీద వర్కౌట్ అవుతుందా?  అంటే… మేకర్స్ మాత్రం నమ్మకంగా ఉన్నట్టు చెబుతున్నారు. కారణం ఏంటంటే.. సినిమా బాగా వచ్చింది.. పైగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నాం అంటున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే.. బడ్జెట్ పెరిగిపోవడంతో అఖిల్, సురేందర్ రెడ్డి ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా వర్క్ చేస్తున్నారట. సినిమా విడుదైన తర్వాత రిజల్ట్ బట్టి పారితోషికం గురించి తర్వాత ఆలోచించాలని ఫిక్స్ అయ్యారని సమాచారం. అంతే కాకుండా ఈ బ్యానర్లోనే మరో సినిమా చేస్తానని అఖిల్ నిర్మాత అనిల్ సుంకరకు మాట ఇచ్చారని తెలిసింది. ఇలా అఖిల్, సురేందర్ రెడ్డి రెమ్యూనరేషన్ తీసుకోకుండా వర్క్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో ఏజెంట్ మూవీని విడుదల చేస్తున్నారు. మరి.. అఖిల్ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్