Saturday, January 18, 2025
Homeసినిమాటీజ‌ర్ రిలీజ్ కాకుండానే.. షేక్ చేస్తోన్న ఏజెంట్.

టీజ‌ర్ రిలీజ్ కాకుండానే.. షేక్ చేస్తోన్న ఏజెంట్.

Shaking: అక్కినేని అఖిల్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. ఈ చిత్రానికి స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత అనిల్ సుంక‌ర‌, సురేంద‌ర్ రెడ్డి సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మ‌ల‌యాళ స్టార్ హీరో మమ్ముట్టి కీల‌క పాత్ర చేస్తుండ‌డం విశేషం. ఈ సినిమా కోసం అఖిల్ చాలా హామ్ వ‌ర్క్ అండ్ హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు. అభిమానులు త‌నపై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌న‌ని గ‌తంలో చెప్పాడు.

అఖిల్ క‌ష్టానికి త‌గ్గ‌ట్టుగా ఏజెంట్ ఇప్పుడు టీజ‌ర్ రిలీజ్ కాకుండానే బిజినెస్ లో రికార్డు క్రియేట్ చేస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 76 కోట్ల బిజినెస్ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ఇక టీజ‌ర్ రిలీజ్ అయితే.. బిజినెస్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. టీజ‌ర్ లో అఖిల్ యాక్ష‌న్, ఫైట్స్  అదిరిపోయాయ‌ని.. ఓ రేంజ్ లో ఉంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

త్వ‌ర‌లోనే ఏజెంట్ టీజ‌ర్ రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన అప్ డేట్ కూడా త్వ‌ర‌లో ఇచ్చేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడు ఏజెంట్ టీజ‌ర్ అప్ డేట్ వ‌స్తుందా అని ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడున్న క్రేజ్ కి త‌గ్గ‌ట్టు ద‌స‌రాకి ఈ సినిమా వ‌స్తే.. బాక్సాఫీస్ షేక్ అవ్వ‌డం.. అఖిల్ స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేయ‌డం ఖాయం.

Also Read : జూలై 8న ఏజెంట్ టీజ‌ర్ రిలీజ్? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్