Picture-2: యూత్ కింగ్ అక్కినేని అఖిల్.. డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్లో అఖిల్ అనే సినిమా రూపొందింది. ఈ మూవీ అంచనాలను ఏ మాత్రం అందుకోలేక పోయింది. ఆ తర్వాత అఖిల్ నటించిన హాలో, మిస్టర్ మజ్ను చిత్రాలు కూడా విజయాన్ని అందివ్వలేదు. ఈసారి ఎలాగైనా సరే.. సక్సెస్ సాధించాలని పట్టుదలతో చేసిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో అఖిల్ తొలి విజయాన్ని సాధించాడు.
ప్రస్తుతం అఖిల్.. ఏజెంట్ అనే భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రూపొందుతోన్న ఏజెంట్ మూవీ ఆగష్టు 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా తర్వాత అఖిల్ చేయనున్న సినిమా ఏంటి అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల అఖిల్ కి భాస్కర్ ఓ కథ వినిపించారట. అఖిల్ ఓకే చెప్పారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాని అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. మరి.. ఈసారి అఖిల్ తో.. బొమ్మరిల్లు భాస్కర్ ఏ తరహా చిత్రం చేయనున్నారో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.