Sunday, January 19, 2025
Homeసినిమాఆ రీమేక్ లో  అఖిల్?

ఆ రీమేక్ లో  అఖిల్?

Akhil-Remake: అక్కినేని అఖిల్ ప్ర‌స్తుతం స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ మూవీ ప్ర‌స్తుతం వైజాగ్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ ను అక్క‌డ చిత్రీక‌రిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగ‌ష్టు 12న వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా త‌ర్వాత అఖిల్ తన ఆల్ టైమ్ ఫేవరెట్ హిందీ మూవీ రీమేక్ లో నటించేందుకు ఓకే చెప్పాడ‌ని టాక్ వినిపిస్తోంది.

ఇంత‌కీ.. ఏ సినిమా అంటారా..? ఏ జవానీ హై దివానీ. ఈ చిత్రాన్ని అఖిల్ తో తెలుగులో రీమేక్ చేయాల‌ని నాగార్జున ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు కానీ.. కుద‌ర‌లేదు. స్నేహం.. ప్రేమ .. కాలేజ్.. కెరీర్ అంటూ అన్ని అంశాల మేలు కలయికతో వచ్చిన ఈ చిత్రం 2013లో విడుద‌లైంది. అప్ప‌ట్టో పెద్ద విజయం సాధించింది. దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా 319 కోట్లు వసూలు చేసింది. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ రీమేక్ కి సమయం వచ్చిందని భావిస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. గ‌తంలో వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మించాలి అనుకున్నారు కానీ.. సెట్ కాలేదు. మ‌రి.. ఇప్పుడు అఖిల్ తో ఈ సినిమాని రీమేక్ చేసే ఛాన్స్ ఎవ‌రు ద‌క్కించుకుంటారో అనేది ఆస‌క్తిగా మారింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాను అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

Also Read : వైజాగ్ లో.. ‘ఏజెంట్’ వార్

RELATED ARTICLES

Most Popular

న్యూస్