Sunday, January 19, 2025
Homeసినిమాఅఖిల్ ఏజెంట్ వచ్చేది ఎప్పుడు?

అఖిల్ ఏజెంట్ వచ్చేది ఎప్పుడు?

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ఏజెంట్.  అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇందులో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండగా అఖిల్ కి జంటగా సాక్షి వైద్య నటిస్తుంది. ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయ్యింది కానీ.. ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి కాలేదు. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడడం.. అలాగే కథలో మార్పులు చేర్పులు చేయాలని షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడం.. ఇలా బ్రేకులు పడడంతో రిలీజ్ కూడా వాయిదా పడింది.

లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ఏజెంట్ రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆ తర్వాత ఈ సంవత్సరం ఆగష్టులో రిలీజ్ అని ప్రకటించారు కానీ కుదరలేదు. దీంతో డిసెంబర్ లో ఏజెంట్ రావడం ఖాయమని ప్రచారం జరిగింది. మేకర్స్ సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ అని ప్రకటించారు. అయితే.. ఏమైందే ఏమో కానీ సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుంది. ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతుండడంతో ఏజెంట్ రిలీజ్ ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది. తాజాగా ఏజెంట్ సినిమాను సంక్రాంతి సీజన్ తర్వాత ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఫిబ్రవరి, మార్చి సినిమా పరిశ్రమకు అన్ సీజన్ అనుకుంటారు. అందుకే పెద్ద సినిమాలు.. చిన్న సినిమాలు ఆ రెండు నెలల్లో విడుదల అవ్వడం చాలా తక్కువ. అయినా కూడా కంటెంట్ పై నమ్మకంతో అఖిల్ ఏజెంట్ ను ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారట. అఖిల్ లుక్ కు ఇప్పటికే ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ సన్నివేశాలు ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. అఖిల్ ఏజెంట్ మూవీ విడుదల తేదీ ఎప్పుడు అనేది మరింత స్పష్టంగా ఒకటి రెండు వారంలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి.. ఈసారైనా ఏజెంట్ చెప్పిన డేట్ కి వస్తాడో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్