Sunday, January 19, 2025
HomeసినిమాAnil Ravipudi - Akhil: అనిల్ రావిపూడితో అఖిల్ నెక్స్ట్ మూవీ?

Anil Ravipudi – Akhil: అనిల్ రావిపూడితో అఖిల్ నెక్స్ట్ మూవీ?

అఖిల్ హీరోగా ఇటీవల వచ్చిన ‘ఏజెంట్’ సినిమా తొలి రోజునే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, భారీ అంచనాల మధ్యనే థియేటర్లకు వచ్చింది. ఫస్టు పోస్టర్ నుంచే ఈ సినిమాపై అందరిలో అంచనాలు పెరిగిపోతూ వచ్చాయి. అఖిల్ సిక్స్ ప్యాక్ .. స్పై యాక్షన్ థ్రిల్లర్ కి సంబంధించిన జోనర్ .. సురేందర్ రెడ్డి మార్క్ యాక్షన్ ఉంటుందని అంతా ఈ సినిమా కోసం వెయిట్ చేశారు. కానీ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలమైంది.

ఈ నేపథ్యంలో అఖిల్ తదుపరి సినిమా ఏ దర్శకుడితో ఉండనుందనే చర్చలు మొదలయ్యాయి. ఈ సందర్భంలోనే అనిల్ రావిపూడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అనిల్ రావిపూడికి తన కెరియర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఫ్లాప్ అనేది తెలియదు. అతను మంచి రైటర్ .. తనకేం కావాలో, తన సినిమాలకి వచ్చే ఆడియన్స్ కి ఏం కావాలో ఆయనకి బాగా తెలుసు. ముఖ్యంగా కామెడీపై ఆయనకి మరింత బలమైన పట్టుంది.

అఖిల్ ఇంతవరకూ లవ్ స్టోరీస్ తో పాటు యాక్షన్ పాళ్లు ఎక్కువ ఉన్న సినిమాలుచేస్తూ వచ్చాడు. కామెడీ టచ్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు పూర్తిస్థాయిలో చేయలేదు. అందువలన ఈ సారి ఆ జోనర్లో అఖిల్ సినిమా ఉంటే బాగుంటుందని నాగార్జున భావిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక అనిల్ రావిపూడి సినిమా అంటే దాదాపు హిట్ అనే నమ్మకం అటు ఆడియన్స్ లోను .. ఇటు ఇండస్ట్రీలోను ఉంది. అందువలన ఆయనతో చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్