Sunday, January 19, 2025
Homeసినిమాడిజె టిల్లు ద‌ర్శ‌కుడితో నాగ‌చైత‌న్య మూవీ?

డిజె టిల్లు ద‌ర్శ‌కుడితో నాగ‌చైత‌న్య మూవీ?

Chitu-Tillu: డిజె టిల్లు సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన డిజె టిల్లు తెలంగాణ యాస‌తో అద్భుతమైన కామెడీ పండించి, ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్ముంతింది.  ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో సిద్దూ వ‌రుస‌గా క్రేజీ ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటున్నాడు. అయితే.. ఈ సినిమా స‌క్సెస్ తో హీరోతో స‌మానంగా ద‌ర్శ‌కుడు విమ‌ల్ కృష్ణ కూడా ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటున్నాడు.

ఈ మధ్య అక్కినేని నాగచైతన్యకు విమల్ కృష్ణ‌ ఓ కథ చెప్పాడట. అది బాగా నచ్చడంతో చైతూ.. ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. విమల్ కృష్ణ  స్క్రిప్టు లాక్ చేస్తే సినిమాను పట్టాలెక్కించవచ్చు. అయితే.. నాగచైతన్య ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ రిలీజ్ కి రెడీగా ఉంది. జులై 8న ఈ చిత్రం విడుద‌ల కానుంది. అలాగే విక్ర‌మ్ కుమార్ డైరెక్ష‌న్ లోనే దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు.

ఆత‌ర్వాత‌ పరశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా, వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇంకా నందిని రెడ్డి దర్శకత్వంలోనూ ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఇవి కాకుండా మరో మూడు ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. అందుచేత ఈ ప్రాజెక్ట్ సెట్ అయినా.. ఇవన్నీ కంప్లీట్ అయితేనే కానీ.. విక్రమ్ కృష్ణ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం లేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్