Sunday, January 19, 2025
HomeసినిమాNagarjuna: నాగ్ నెక్ట్స్ మూవీ ఎప్పుడు.?

Nagarjuna: నాగ్ నెక్ట్స్ మూవీ ఎప్పుడు.?

నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’, ‘ది ఘోస్ట్’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. దీంతో ఆలోచనలో పడిన నాగార్జున ఈసారి ఎంటర్ టైన్మెంట్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యారు. మలయాళంలో విజయం సాధించిన ‘పోరింజు మరియం జోస్’ చిత్రాన్ని రీమేక్ చేయాలి అనుకున్నారు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ కి అప్పగించాలి అనుకున్నారు. అయితే.. ఎప్పుడో సెట్స్ పైకి రావాల్సిన ఈ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. ఉగాదికి అనౌన్స్ మెంట్ అన్నారు కానీ.. రాలేదు. దీంతో నాగ్ మూవీ వెనుక ఏం జరుగుతుంది..? అనేది ఆసక్తిగా మారింది.

ఇంతకీ విషయం ఏంటంటే… ఈ సినిమా రీమేక్ హక్కుల విషయంలో నిర్మాతలిద్దరికీ వచ్చిన అభిప్రాయభేదాల వల్ల రెండు నెలలు బ్రేక్ పడింది. దీని కోసమే ప్రత్యేకంగా గెడ్డం పెంచి కొత్త లుక్ కి వచ్చారు నాగ్. అది తనకు పూర్తి సంతృప్తినివ్వకపోవడంతో మళ్ళీ క్లీన్ షేవ్ కు వచ్చేశారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. ఇది కాకుండా స్క్రిప్ట్ లో చేసిన మార్పులు కూడా మరోసారి చర్చలోకి వచ్చాయట. కంగారుపడి సినిమా చేయడం కన్నా.. ఆలస్యం అయినా ఫరవాలేదు హిట్ సినిమా చేయాలనే పట్టుదలతో ఉన్నారట.

ఈ సినిమాతో పాటు మరో కథ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తుంది. అలాగే బెజవాడ ప్రసన్న కుమార్ కాకుండా మరో డైరెక్టర్ తో కూడా కథా చర్చలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇది నాగార్జునకు 99వ చిత్రం. ఇది పూర్తైన తర్వాత మోహన్ రాజా డైరెక్షన్ లో 100వ చిత్రం చేయనున్నారు. ఈ సినిమా కథను నాగార్జునకు మోహన్ రాజా ఎప్పుడో చెప్పారు. ఇందులో అఖిల్ గెస్ట్ రోల్ చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. మరి.. త్వరలోనే నాగ్ నెక్ట్స్ గురించి క్లారిటీ వస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్