Saturday, January 18, 2025
Homeసినిమాధనుష్, శేఖర్ కమ్ముల మూవీలో నాగార్జున..?

ధనుష్, శేఖర్ కమ్ముల మూవీలో నాగార్జున..?

ధనుష్‌, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో మూవీ అని ఎప్పుడో ప్రకటించారు కానీ.. ఇంత వరకు ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ సినిమా కంటే తర్వాత ప్రకటించిన సార్ మూవీ కంప్లీట్ అవ్వడం.. రిలీజై బ్లాక్ బస్టర్ అవ్వడం కూడా జరిగింది కానీ.. శేఖర్ కమ్ముల మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ప్రకటించలేదు. ఆమధ్య స్ర్కిప్ట్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదని.. శేఖర్ కమ్ముల ఎంత కుస్తీ పెట్టినా ధనుష్ కు నచ్చడం లేదని వార్తలు వచ్చాయి. ఒకానొక దశలో అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందో.. ఉండదో అనే టాక్ కూడా వినిపించింది.

తాజా వార్త ఏంటంటే.. ఇప్పుడు స్టోరీ లాక్ అయ్యిందట. శేఖర్ కమ్ముల ఈ కథ పై రెండేళ్లు వర్క్ చేశారు. మేటర్ ఏంటంటే.. ఇప్పుడు ఈ మూవీ భారీ మల్టీస్టారర్ గా మారిపోయిందట. ధనుష్ కి జంటగా క్రేజీ హీరోయిన్ రష్మికను ఎంపిక చేయాలి అనుకుంటున్నారట. డేట్ లు ఫైనల్ అయితే.. రష్మిక కన్ ఫర్మ్ అయ్యే ఛాన్స్ వుంది. ఇందులో ఓ సీనియర్ హీరో క్యారెక్టర్ ఉందట. ఆ పాత్రను నాగార్జునతో చేయించనున్నారని తెలిసింది. గతంలో నాగార్జున, ధనుష్‌ కలిసి ఓ సినిమా చేయాలి అనుకున్నారు. కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆగింది. ఇప్పుడు నాగ్ – ధనుష్ కాంబో సెట్ అయ్యిందని టాక్.

ఈ చిత్రానికి మ్యూజిక్ ని ఏఆర్ రెహమాన్ తోనే చేయించాలని ఫిక్స్ అయ్యారట. మొత్తానికి ధనుష్‌, శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ భారీ ప్రాజెక్ట్ గా సెట్ అవుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫాస్ట్ గా జరుగుతుంది. ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన ఈ ప్రాజెక్ట్ బాగా ఆలస్యం అవ్వడంతో ఇక నుంచి స్పీడు పెంచి త్వరగా సెట్స్ పైకి తీసుకురావాలి అనుకుంటున్నారట. అయితే.. ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో క్లారిటీ రావాల్సివుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందించనున్నారు. మరి.. ఈ భారీ, క్రేజీ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్