Sunday, January 19, 2025
Homeసినిమాచిరు మూవీలో అక్కినేని ఫ్యామిలీ హీరో..?

చిరు మూవీలో అక్కినేని ఫ్యామిలీ హీరో..?

చిరంజీవి మూవీలో అక్కినేని ఫ్యామిలీ హీరో ఎవరనుకుంటున్నారా..? సుశాంత్. అవును.. చిరు మూవీలో సుశాంత్ నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ‘కాళిదాసు’ సినిమాతో సుశాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే నటుడుగా ఆకట్టుకున్నప్పటికీ.. కమర్షియల్ సక్సెస్ మాత్రం సాధించలేదు. ఆతర్వాత ‘కరెంట్’ అంటూ మరో సినిమా చేశాడు. ఈ సినిమా కూడా బాగా నటించాడు.. బాగా డ్యాన్స్ చేస్తున్నాడు అనే పేరు తెచ్చుకున్నాడు కానీ.. కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. ఆతర్వాత అడ్డా అనే సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించాడు.

అడ్డా తర్వాత చేసిన ఆటాడుకుందాం రా సినిమా ఆకట్టుకోలేకపోవడంతో.. వేరే హీరోల సినిమాల్లో ముఖ్యపాత్రల్లో నటించే ఛాన్స్ వచ్చినా నటించాలి అని ఫిక్స్ అయ్యాడు. ఆ టైమ్ లోనే అల్లు అర్జున్ సినిమా అల.. వైకుంఠపురములో ముఖ్యపాత్ర పోషించాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడంతో సుశాంత్ కి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు రవితేజ నటిస్తున్న రావణాసుర చిత్రంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఏప్రిల్ 7న రావణాసుర విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ లో సుశాంత్ డిపరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ ‘భోళా శంకర్’ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నాడని టాక్ వినిపిస్తోంది.ఈ మూవీలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. కీర్తి సురేష్, లవర్ క్యారెక్టర్ లో సుశాంత్ నటింనున్నాడని తెలిసింది. ముందుగా ఈ క్యారెక్టర్ ను గెస్ట్ రోల్ అనుకున్నప్పటికీ సుశాంత్ అని అనుకున్నప్పుడు క్యారెక్టర్ లెంగ్త్ కాస్త పెంచారట. ఓ పాటలో కూడా సుశాంత్ కనిపిస్తాడట. మరో వైపు హీరోగా సినిమాలు చేసేందుకు కథలు వింటున్నాడు. మొత్తానికి ఓ వైపు హీరోగా, మరో వైపు ముఖ్యపాత్రలు పోషిస్తూ కెరీర్ ను బాగా డిజైన్ చేసుకుంటున్నాడు సుశాంత్.

Also Read : మరోసారి పోటీపడనున్న చిరు, బాలయ్య..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్