Sunday, January 19, 2025
Homeసినిమాపుష్ప 2 లో బాలీవుడ్ స్టార్!

పుష్ప 2 లో బాలీవుడ్ స్టార్!

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’.  ఇటీవల విడుదలైన ఈ సినిమా తీజర్ చాలా తక్కువ టైమ్ లోనే 100 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా గురించి రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. మేకర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ ఉండడం లేదు. దీంతో  ప్రచారంలో ఉన్న వార్త నిజమా..? లేక గ్యాసిప్పా అనేది ఆసక్తిగా మారుతోంది.

పుష్ప 2 లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. దీనితో  ఈ సినిమాకి ఇప్పటికే క్రేజ్ ఉంది. దీనికి తగ్గట్టుగా బాలీవుడ్ స్టార్ తో గెస్ట్ రోల్ చేయిస్తే..  ఇది మరింత పెరుగుతుందనేది మేకర్స్ ప్లాన్… అందుకే అక్షయ్ ని కాంటాక్ట్ చేశారని వార్తలొస్తున్నాయి.  ఒక వేల అక్షయ్ ఓకే అంటే  సినిమాకు బిజినెస్ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తున్న విషయం తెల్సిందే. ఫస్ట్ పార్ట్ లో సమంతతో ఐటమ్ సాంగ్ చేయించారు. ఈసారి ఎవరితో అనేది తెలియాల్సివుంది. రష్మిక మాత్రమే కాకుండా మరో హీరోయిన్ పాత్ర లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కనిపించబోతుందనే వార్తలు కూడా ఉన్నాయి. ఈ ఇయర్ ఎండింగ్ కి షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఆతర్వాత రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్