Saturday, January 18, 2025
Homeసినిమా'అలా ఇలా ఎలా' చిత్రం నుంచి 'దాక్కో దాక్కో' పాటను విడుదల చేసిన లారెన్స్

‘అలా ఇలా ఎలా’ చిత్రం నుంచి ‘దాక్కో దాక్కో’ పాటను విడుదల చేసిన లారెన్స్

శక్తి వాసుదేవన్ హీరోగా రాజ్ శంకర్, పూర్ణ, నాగ బాబు, బ్రహ్మానందం, అలీ, సీత, సితార, నిషా కొఠారి ప్రధాన పాత్రలో రాబోతోన్న చిత్రం ‘అలా ఇలా ఎలా’. రాఘవ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని కళ మూవీ మేకర్స్ పతాకం పై కొల్లకుంట నాగరాజు నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించిన పాటలను ఇటీవలే హిందూపూర్ లో అంగరంగవైభవంగా విడుదల చేశారు. ఇప్పుడు ఈ చిత్రంలో థర్డ్ లిరికల్ సాంగ్‌ను దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ రిలీజ్ చేశారు.

అనంతరం రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. “కళ మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మాతగా నిర్మించిన చిత్రం ఆలా ఇలా ఎలా. సినిమా చూశాను. చాలా నచ్చింది. నేను విడుదల చేసిన పాట కూడా చాలా బాగుంది. భాస్కర్ భట్ల గారు ఈ పాటకి లిరిక్స్ అందించారు. సినిమా మంచి హిట్ అవుతుంది. ఈ చిత్రంలో శక్తి హీరోగా చాలా బాగా నటించాడు. పాటలో కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. జులై 21న ఈ సినిమా ఎస్.కె ఎం.ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా విడుదల అవుతోంది. అందరూ సినిమాని చూసి సూపర్ హిట్ చేయండి’ అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్