Tuesday, February 25, 2025
HomeTrending Newsమద్యపాన నిషేధానికి ఉమాభారతి వినూత్న ప్రచారం

మద్యపాన నిషేధానికి ఉమాభారతి వినూత్న ప్రచారం

భారతీయ జనతాపార్టీ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి మద్యపాన నిషేధానికి వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. రాష్ట్రంలోని నివారీ జిల్లాలో గల ఓ మద్యం దుకాణం ముందు ఆవులను కట్టేసి.. అక్కడికి వచ్చి పోయేవారికి ‘మద్యం కాదు.. ఆవు పాలు తాగండి’ అంటూ ప్రచారం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడితే వచ్చే సొమ్ము కోసం ఆశపడొద్దని, మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమా భారతి అభ్యర్థించారు.

‘మద్యపానంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడితే వచ్చే సొమ్ము కోసం ఆశపడొద్దని, మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నా. రాష్ట్రంలోని పేద ప్రజలకు మద్యపానం ఓ సమస్యగా మారింది. దీనికి నేను కూడా కొంతవరకు కారణమే. అందుకే మధ్యప్రదేశ్‌తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం కోసం కృషి చేస్తాను’ అని ఈ సందర్భంగా ఉమా భారతి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్