Monday, February 24, 2025
HomeTrending Newsమంకీ పాక్స్ కేసులపై కేంద్రం అప్రమత్తం

మంకీ పాక్స్ కేసులపై కేంద్రం అప్రమత్తం

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ కేసులు 16 వేలు దాటిన నేపథ్యంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించడం తెలిసిందే. డబ్ల్యూహెచ్ఓ ప్రకటనను భారత కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఢిల్లీలోనూ తొలికేసు వెల్లడైన నేపథ్యంలో, ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ప్రపంచ దేశాల్లో మంకీపాక్స్ కేసుల తీరుతెన్నులు, దేశంలో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఢిల్లీలో ఆదివారం మరో పాజిటివ్ కేసు నమోదైంది. విదేశీ ప్రయాణాల చరిత్ర లేని ఆ 34 ఏళ్ల వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించగా, పరీక్ష చేస్తే పాజిటివ్ అని తేలింది. అతడు ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీలో ఓ స్టాగ్ పార్టీ (పురుషులు మాత్రమే హాజరయ్యే పార్టీ)కి హాజరైనట్టు తెలిసింది. అతడిని లోక్ నాయక్ ఆసుపత్రిలో ఐసోలేషన్ లో ఉంచారు. కాగా, దేశంలో ఇప్పటిదాకా వెల్లడైన మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకి చేరింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్