Saturday, January 18, 2025
Homeసినిమా‘నాంది’ రీమేక్ చేయనున్న దిల్ రాజు, అజయ్ దేవగన్

‘నాంది’ రీమేక్ చేయనున్న దిల్ రాజు, అజయ్ దేవగన్

అల్లరి నరేష్‌ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నాంది’.  కోర్టు సన్నివేశాలు, ఎమోషన్స్ ప్రధాన బలంగా తెరకెక్కిన ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంది, గత కొంతకాలంగా సరైన సక్సస్ కోసం ఎదురు చూస్తున్న అల్లరి నరేష్ కు ఈ సినిమా విజయం మంది కిక్ అందించింది, ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తో కలిసి దిల్ రాజు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.

ఈ ఆసక్తికర కాంబినేషన్ పై అజయ్ స్పందించారు. ‘నాంది చాలా కీలకమైన చిత్రం. మన ప్రభుత్వ విధానాల్లో ఉన్న లూప్ హొల్స్ ని బయట పెట్టే చిత్రం ఇది. తెలుగు వర్షన్ ప్రభావవంతంగా, అద్భుత పెర్ఫామెన్స్ తో ఉంది. ఈ చిత్రాన్ని ఎక్కువ ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా నేను, దిల్ రాజు చేతులు కలిపాం. ‘నాంది’ మూవీని మా నిర్మాణంలో హిందీలో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాం. మేము ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. స్క్రిప్ట్ ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాల్సి ఉంది. నటీనటుల ఎంపిక తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తాం అని అజయ్ దేవగన్ తెలియచేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్