Sunday, January 19, 2025
HomeTrending News‘‘ధరణి’’ ప్రజల పాలిట గుదిబండ - బండి సంజయ్

‘‘ధరణి’’ ప్రజల పాలిట గుదిబండ – బండి సంజయ్

రాష్ట్ర ప్రజలకు ‘‘ధరణి’’ పోర్టల్ గుదిబండలా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షలు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నేతలు కొందరు అధికారుల అండదండతో అర్ధరాత్రి ధరణి పోర్టల్ ను ఓపెన్ చేయించుకుని ప్రభుత్వ, పేదల భూములను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు.
తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్ రావు, తదితరులతో కలిసి ఇటీవల మాత్రు వియోగంతో బాధపడుతున్న పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జోన్ అధ్యక్షులు గౌతమ్ రావును పరామర్శించారు. ఆ తర్వాత   మహిళలపై కొనసాగుతున్న అత్యాచారాలతోపాటు ప్రీతి ఘటనకు నిరసనగా వరంగల్ పోచమ్మ మైదాన్ నుండి కాకతీయ మెడికల్ కాలేజీ వరకు బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు, పార్టీ కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ ర్యాలీలో పాల్గొన్నారు.  అనంతరం మీడియాతో మాట్లాడారు.

అందులోని ముఖ్యాంశాలు….

• నేను ఏ జిల్లాకు వెళ్లినా పేదలు ఇండ్లు అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2.4 లక్షల ఇండ్లు మంజూరు చేసినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇయ్యలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం లేఖ రాసినా స్పందించలేదు.

• ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డుబల్ బెడ్రూం ఇండ్ల విషయంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంత మంది లబ్దిదారులకు ఇండ్లు ఇఛ్చారు? కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇండ్లు మంజూరు చేసింది? అనే వివరాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి.

• రాష్ట్ర ప్రభుత్వం అక్కడక్కడా కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు గ్రుహ ప్రవేశం చేయకముందే కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఎక్కడ చూసినా పగుళ్లు కన్పిస్తున్నాయి. పేదలకు ఒక్క ఇల్లు ఇయ్యని కేసీఆర్ తాను మాత్రం 100 రూములతో ప్రగతి భవన్ కట్టుకున్నడు.

• రుణమాఫీ అమలు కాక రైతులు అల్లాడుతున్నరు. రైతుల ఉసురు పోసుకుంటున్నడు. ఈ జిల్లాలో ఐకేపీ సెంటర్లలో పెద్ద కుంభ కోణం జరుగుతున్నా చర్యల్లేవు. రూ.20 కోట్ల కుంభ కోణం బయటపడింది. పండించిన ప్రతి గింజ మేమే కొంటామని చెప్పిన కేసీఆర్ ఫ్రభుత్వం … మాట తప్పింది. పండించిన ప్రతి గింజకు పైసలిస్తోంది కేంద్రమే.

• జిల్లాలో అతిపెద్ద సమస్య ధరణి. అర్ధరాత్రి ధరణి పోర్టల్ ను ఓపెన్ చేసి అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నరు. పేదల భూముల వారి పేర్లపై ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి. రుణాలు రావడం లేదు. ధరణి తెలంగాణ ప్రజలకు గుదిబండగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్