Sunday, January 19, 2025
HomeTrending Newsరేవంత్ రెడ్డితో కాంగ్రెస్ బాగుపడదు - మర్రి శశిధర్ రెడ్డి విమర్శ

రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ బాగుపడదు – మర్రి శశిధర్ రెడ్డి విమర్శ

టిఆర్ఎస్ ను ఎదుర్కొనే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకింది.. అది నయం చేయలేని స్థితికి చేరుకుందన్నారు. కాంగ్రెస్ వదిలి బిజెపిలో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో మర్రి శశిధర్ రెడ్డి  ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఒక హోంగార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి పోతే పోయేదేమీ లేదని పరోక్షంగా రేవంత్ రెడ్డిని విమర్శించారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగ్గా లేదని, మునుగోడు ఉప ఎన్నికల్లో తాను 10 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. ఇంచార్జ్ లతో డబ్బు ఖర్చు పెట్టించి వారిని డొల్ల చేశాడని ఆరోపించారు. ఖర్చు పెట్టకపోతే టికెట్లు, పదవులు ఇవ్వనని బెదిరించాడని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు రేవoత్ అందుబాటులో ఉండడని మండిపడ్డారు. చెంచా గాళ్లను పెట్టి పార్టీని నడిపిస్తున్నాడని, తన లాగే చాలామంది పార్టీని వీడే అవకాశం ఉందని మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. 3000 నుంచి 20వేల కు ఓట్లు పెరిగాయని సంబరపడడం అవివేకమన్నారు.

వచ్చే ఎన్నికల్లో పదిహేను మందిని గెలిపించుకొని తన సొంత దుకాణం చూసుకోవాలని రేవంత్ భావిస్తున్నారని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. రేవంత్ కు పీసీసీ ఇవ్వొద్దని వారించిన వారిలో నేను ఒకడినని చెప్పారు. తెలంగాణ పార్టీ పరిస్థితులపై మూణ్ణెళ్ల క్రితమే అధిష్టానానికి చెప్పాను..కాంగ్రెస్ నుంచి మారుతా అని అనుకోలేదని మర్రి పేర్కొన్నారు. ఎల్లపుడూ కాంగ్రెస్ మ్యాన్ ని అనుకున్నా..తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారక తప్పడం లేదన్నారు. నేను రాజకీయ నాయకుణ్ణి, ఇంకా రిటైర్ కాలేదని మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read: కవితను సంప్రదించింది ఎవరో తేల్చాలి రేవంత్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్