Sunday, September 8, 2024
Homeసినిమా'దేవర'లో అల్లు అర్జున్ కూతురు అర్హ నటిస్తుందా..?

‘దేవర’లో అల్లు అర్జున్ కూతురు అర్హ నటిస్తుందా..?

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ సినిమా ఎప్పటి నుంచో వార్తల్లో ఉంది. చాన్నాళ్లు కొరటాల కథ పై కసరత్తు చేశారు. ఆఖరికి అన్ని అడ్డంకులను దాటుకుని ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంటే.. విలన్ గా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్, సైఫ్ ఆలీఖాన్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. ఈ నెల 20 నుంచి వరకు 24 వరకు సోల్మన్ మాస్టర్ కొరియోగ్రఫీలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించబోతున్నారు.

ఈ యాక్షన్ షెడ్యూల్ లో ఎన్టీఆర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ పాల్గొనబోతున్నారని సమాచారం. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ కుమార్తె అల్లు అర్హ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. అల్లు అర్హ శాకుంతలం సినిమాతో టాలీవుడ్ లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే  మెప్పించింది. ఇప్పుడు ఎన్టీఆర్ దేవరలో నటించే ఛాన్స్ దక్కించుకుందని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్, బన్నీ మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ బావ.. బావ అని పిలుచుకుంటారు.

ఇప్పుడు ఎన్టీఆర్ మూవీలో బన్నీ కూతురు నటించడం అనేది ఆసక్తిగా మారింది. ఇది గెస్ట్ రోల్ కాదని.. కీలక పాత్ర అని కూడా ప్రచారం జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా గ్యాప్ రావడంతో ఈ చిత్రాన్ని సాధ్యమైనంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు. నవంబర్ కి ఈ సినిమా షూటింగ్ మొత్తం చేయాలనేది టార్గెట్. డిసెంబర్ నుంచి ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతారు. అయితే.. అల్లు అర్హ దేవరలో నటించడం అనేది నిజమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న దేవర చిత్రం భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్