Sunday, January 19, 2025
Homeసినిమావద్దు బ్రదర్.. అంటున్న బన్నీ ఫ్యాన్స్

వద్దు బ్రదర్.. అంటున్న బన్నీ ఫ్యాన్స్

షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘జవాన్’. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షారుఖ్ ఖాన్ కు జంటగా నయనతార నటిస్తుంది. ఇటీవల ‘పఠాన్’ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించడంతో జవాన్ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. అంచనాలకు తగ్గట్టుగా జవాన్ మూవీకి పాన్ ఇండియా అప్పీల్ ఇచ్చేందుకు షారుఖ్ ట్రై చేస్తున్నారు. ఇందులో భాగంగా జవాన్ మూవీలో కోలీవుడ్ స్టార్ విజయ్ తో ఓ కీలక పాత్ర చేయించాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు.

ఇప్పుడు ఆ కీలక పాత్రను అల్లు అర్జున్ తో చేయించాలి అనుకుంటున్నారట. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి కొందరు అభిమానులు బన్నీ బాలీవుడ్ డెబ్యూ అంటూ ఆనందం వ్యక్తం చేయగా, మరి కొందరైతే.. నటించవద్దు అంటూ బన్నీకి సలహాలు ఇస్తున్నారు. పుష్ప సినిమాతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు పుష్ప 2 మూవీతో మరింత క్రేజ్ పెరగడం ఖాయం. ఇలాంటి టైమ్ లో వేరే సినిమాలో కీలక పాత్ర చేయడం అవసరమా..? వద్దు బ్రదర్ అంటూ బన్నీకి సలహాలు ఇస్తున్నారు అభిమానులు.

ఇలాంటి టైమ్ లో షారూక్ సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించే బదులు, నేరుగా బాలీవుడ్ లో హీరోగా ఓ సినిమా చేయమని బన్నీకి సలహాలిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతానికి ఇదంతా ఊహాగానం మాత్రమే. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే..  జవాన్ మేకర్స్ నిజంగానే బన్నీని సంప్రదించారా..? లేదా..? అనే విషయాన్ని పక్కనపెడితే.. వద్దు బ్రదర్ అంటూ అల్లు అర్జున్ ఆర్మీ చేస్తున్న హడావుడి మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఉంది. ఇదే కనుక నిజమైతే.. బన్నీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనేది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్