షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీ బాలీవుడ్ కి కావాల్సిన బ్లాక్ బస్టర్ ని అందించింది. ఇందులో దీపికా పడుకునే కథానాయికగా నటించగా జాన్ అబ్రహం విలన్ గా నటించారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ 1000 కోట్లకు దిశగా దూసుకెళుతుంది. నాలుగు సంవత్సరాల నుంచి సరైన సక్సెస్ లేక సతమతమౌతున్న షారుఖ్ ఖాన్ కి ఈ బ్లాక్ బస్టర్ మాంచి బూస్టప్ అని చెప్పచ్చు. ప్రస్తుతం షారుఖ్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ‘జవాన్’ అనే సినిమా చేస్తున్నారు.
‘జవాన్’ షూటింగ్‌ని ఇటీవలే పునః ప్రారంభించారు. ఇప్పుడు, జవాన్‌లో అతిధి పాత్రలో నటించడడం కోసం దర్శకుడు అట్లీ టాలీవుడ్ అల్లు అర్జున్‌ని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పాన్ ఇండియన్ మూవీలో నటించడానికి అల్లు అర్జున్ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో బన్నీ నటిస్తే.. ఇద్దరు హీరోల అభిమానులకు పండుగే. అయితే.. ప్రచారంలో ఉన్న వార్త పై క్లారిటీ రావాలంటే.. జవాన్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ లో అందాల తార నయనతార కథానాయిక గా నటిస్తుంది.
అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ కి నార్త్ లో బాగా క్రేజ్ పెరిగింది. దీంతో షారుఖ్ ఖాన్ మూవీలో అల్లు అర్జున్ నటిస్తే సౌత్ లో ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. అలాగే నార్త్ లో ఈ మూవీ పై మరింత క్రేజ్ పెరుగుతుందనే ఉద్దేశ్యంతో బన్నీని కాంటాక్ట్ చేసారని టాక్ బలంగా వినిపిస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ షూటింగ్ లో ఉన్నారు. రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుగుతుంది. మరి.. ఇంత బిజీలో షారుఖ్ మూవీలో గెస్ట్ రోల్ చేసేందుకు పుష్పరాజ్ ఎస్ చెబుతాడో..? నో చెబుతాడో..? చూడాలి.