Ghani: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గని’. ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. భారీ స్పోర్ట్స్ యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటించింది. ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ బ్యానర్స్ పై సిద్ధూ ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన గని సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ గని చిత్రం ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా గని ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్‌లో సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ ”మా అన్నయ్య అల్లు బాబీ ఈ సినిమాతో ప్రొడ్యూసర్ అయ్యాడు. మా ఫ్యామిలీలో ఫాదర్ తర్వాత ఎవరూ ప్రొడ్యూసర్ అవ్వలేదే అనిపించేది. ఇన్నాళ్ల తర్వాత అన్నయ్య నిర్మాత అయినందుకు వెరీ వెరీ హ్యాపీ. నేను ఎంచుకున్న కథల్లో చాలా పెద్ద పార్ట్ అన్నయ్యదే. 20 సంవత్సరాల ఎక్స్ పీరియన్స్ ఉంది అన్నయ్యకు. ఇక మరో నిర్మాత సిద్దూ గురించి చెప్పాలి.. చాలా కష్టాలు పడ్డాడు. అన్ని కష్టాలు పడి ఇన్నేళ్ల తర్వాత ప్రొడ్యూసర్ అయి మంచి సినిమా తీశాడు. వెరీ సక్సస్ ఫుల్ ప్రొడ్యూసర్ అవుతాడు”
“ఇక వరుణ్ గురించి చెప్పాలి. నాకు వరుణ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. తన పుట్టినప్పటి నుంచి అందగాడు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత వరుణ్ అంటే.. రెస్పక్ట్ కూడా వచ్చింది. కారణం ఏంటంటే.. రెగ్యులర్ గా సినిమాలు చేసేయచ్చు అని కాకుండా.. డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటున్నాడు. గని సినిమా చూశాను చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ చాలా బాగుంది. పాత్రకు తగ్గట్టుగా బాగా నటించింది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నరేష్, నదియా.. ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారు. ఖచ్చితంగా అందర్నీ ఆకట్టుకుని గని పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.
Also Read : ‘గని’ అందర్నీ అలరిస్తుందని గట్టి నమ్మకం : వరుణ్ తేజ్.