Saturday, January 18, 2025
Homeసినిమామేకోవ‌ర్ తో షాక్ ఇచ్చిన అల్లు అర్జున్

మేకోవ‌ర్ తో షాక్ ఇచ్చిన అల్లు అర్జున్

అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్న‌ప్పుడు ఆయ‌న లుక్ రిలీజ్ అవ్వ‌గానే.. ఫ్యాన్స్ షాక్ అయ్యారు. హెయిర్ బాగా పెంచేసి, గెడ్డం పెంచేసి మాస్ కాదు.. ఊర మాస్ అనేలా లుక్ ను డిజైన్ చేశారు. ఎర్ర చంద‌నం కూలీ నుంచి సిండికేట్ ని శాసించే  వ‌ర‌కు ఎదిగిన పుష్ప రాజ్ లుక్ సంచలనం క్రియేట్ చేసింది. ఈ లుక్ మాస్ ఆడియ‌న్స్ కి విప‌రీతంగా న‌చ్చేసింది. అల్లు అర్జున్ కెరీర్ లో హైలైట్ అయ్యింది.

ఇప్ప‌టికీ అల్లు అర్జున్ అదే మేకోవ‌ర్ లో ఉన్నాడు. అదే లుక్ కంటిన్యూ చేస్తున్నాడు. అయితే… అల్లు అర్జున్ ఇప్పుడు యాడ్ షూట్ లో పాల్గొన్నాడు. హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో ఓ యాడ్ షూట్ లో పాల్గొన్నాడు. ఇది పైప్స్ కి సంబంధించిన యాడ్. అయితే.. అల్లు అర్జున్ పుష్ప‌రాజ్ లుక్ లోనే క‌నిపిస్తాడు అనుకుంటే.. అంత‌కు మించిన మేకోవ‌ర్ లో క‌నిపించి షాక్ ఇచ్చారు.

చెవికి పోగులు, నోటిలో చుట్ట‌, మెడ‌లో గొలుసు హెయిర్ కి అక్క‌డ‌క్క‌డా తెల్ల‌ని క‌ల‌ర్, చిన్న‌గా మెరిసిన గెడ్డం హెయిర్ లాగి జ‌డ వేసిన గెట‌ప్ లో బ‌న్నీ లుక్ కు ఫాన్స్ ఫిదా అవుతున్నారు.  ఈ స్టిల్ ఇలా రిలీజ్ చేసారో లేదో అలా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఈ లుక్ ఆయ‌న అభిమానుల‌కే కాదు మూవీ ల‌వ‌ర్స్ అంద‌ర్నీ విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. ఇక పుష్ప 2 విష‌యానికి వ‌స్తే… సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళుతుంద‌ని టాక్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్