Sunday, January 19, 2025
Homeసినిమాబింబిసారుడికి బన్నీ ప్రశంశలు

బింబిసారుడికి బన్నీ ప్రశంశలు

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్.. ఓ వైపు హీరోగా సినిమాల్లో న‌టిస్తూ.. మ‌రో వైపు నిర్మాత‌గా సినిమాలు నిర్మిస్తున్నాడు. అత‌నొక్క‌డే, ప‌టాస్, ఓం చిత్రాల‌తో కొత్త ద‌ర్శ‌కులు ప‌రిచ‌యం చేశాడు. ఇప్ప‌డు బింబిసార మూవీతో మ‌రో డైరెక్ట‌ర్ వ‌శిష్ట్ ను డైర‌క్ట‌ర్ గా ప‌రిచ‌యం చేశాడు. ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యిందంటే.. ఈ ఏరేంజ్ స‌క్సెస్ సాధించిందో అర్థం చేసుకోవ‌చ్చు. బింబిసార బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి ఇండ‌స్ట్రీలో ఉత్సాహాన్ని అందివ్వ‌డంతో చిరంజీవి, నాగార్జున‌.. ఇలా సినీ ప్ర‌ముఖులంద‌రూ బింబిసార టీమ్ ని అభినందిస్తున్నారు.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా బింబిసార బ్లాక్ బ‌స్ట‌ర్ సంద‌ర్భంగా స్పందించాడు. ఇంత‌కీ బ‌న్నీ ఏమ‌న్నాడంటే.. “బింబిసార బృందానికి బిగ్ విషెస్.. చాలా ఆసక్తికరమైన ఆకర్షణీయమైన ఫాంటసీ చిత్రమిది. నందమూరి కళ్యాణ్ రామ్ గారి ప్రభావవంతమైన ఉనికిని చాటింది. ఎప్పుడూ కొత్త టాలెంట్ ని ఇండస్ట్రీలోకి తీసుకువస్తూ కొత్త తరహా సినిమాలను ట్రై చేస్తున్నందుకు ఆయనంటే నాకు గౌరవం.  దీన్ని బాగా హ్యాండిల్ చేసినందుకు డెబ్యూ డైరక్టర్ వశిష్టను నేను అభినందిస్తున్నాను. టెక్నీషియన్స్, ఆర్టిస్టులందరికీ అభినందనలు. ఎంఎం కీరవాణి గారు కేథరిన్ థ్రెసా.. సంయుక్త.. NTR ఆర్ట్స్ అందరినీ మ‌న‌స్పూర్తిగా అభినందిస్తున్నాను. ఈ చిత్రం అన్ని వయసుల వారికి వినోదం అందిస్తుంది” అని అల్లు అర్జున్ బింబిసారను ప్రశంసించారు. ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

Also Read : బింబిసార’గా మెప్పించిన కల్యాణ్ రామ్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్