Monday, January 20, 2025
Homeసినిమాచిరుకు థ్యాంక్స్ చెప్పిన ‘పుష్ప‌రాజ్’

చిరుకు థ్యాంక్స్ చెప్పిన ‘పుష్ప‌రాజ్’

Chiru wish Pushpa Raj:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‌’. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. ‘ఆర్య‌’, ‘ఆర్య-2’ త‌ర్వాత బ‌న్నీ, సుక్కు క‌లిసి చేసిన సినిమా కావ‌డం.. అలాగే ఇది ఇద్ద‌రికి ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ భారీ క్రేజీ చిత్రం ‘పుష్ప’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

అయితే.. పుష్ప రిలీజ్ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ.. చిత్ర యూనిట్ కి విషెస్ తెలిపారు. హీరో అల్లు అర్జున్, డైరక్టర్ సుకుమార్, హీరోయిన్ రష్మిక మందన్న, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కి మొత్తం చిత్ర యూనిట్ కి విషెస్ తెలిపారు. ‘ఈ చిత్రం కోసం మీ ఎఫర్ట్స్ అన్నీ కూడా అభినందించదగినవి’ అని అన్నారు. అయితే.. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదిక గా చేసిన వ్యాఖ్యలకు అల్లు అర్జున్ స్పందిస్తూ… ‘థ్యాంక్యూ వెరీ మచ్ చికబాబీ చిరంజీవి గారు’ పుష్ప చిత్రంతో మీ హృదయాలను దోచుకుంటామ‌ని ఆశిస్తున్నాను’ అంటూ అల్లు అర్జున్  ప్రతిస్పందించారు.

Also Read : సినిమా గెల‌వాలి, అన్ని చిత్రాల‌కి ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కాలి : అల్లు అర్జున్

RELATED ARTICLES

Most Popular

న్యూస్