Saturday, January 18, 2025
Homeసినిమాఅల్లు శిరీష్ 'ఉర్వశివో రాక్షసివో' టీజర్ విడుదల

అల్లు శిరీష్ ‘ఉర్వశివో రాక్షసివో’ టీజర్ విడుదల

అల్లు శిరీష్‌ తాజా చిత్రం ‘ఉర్వశివో రాక్షసివో‘, ‘విజేత’ సినిమా దర్శకుడు రాకేష్ శశి దీన్ని రూపొందించారు. శిరీష్ సరసన అను ఇమ్మాన్యూల్ నటించింది.GA2 పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

తాజాగా ‘ఉర్వశివో రాక్షసివో’  టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ టీం. టీజర్ చూస్తుంటే… అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది అని చెప్పొచ్చు.టీజర్ మొత్తం ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా యూత్‌పుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ అని అర్ధమవుతుంది. అంతర్లీనంగా ప్రేమకి,స్నేహానికి ఉన్న తేడాను దర్శకుడు ఆవిష్కరించినట్లు అర్ధమవుతుంది.

స్మాల్ గ్యాప్ తర్వాత శిరీష్ నుంచి ఈ చిత్రం రావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని GA2 పిక్చర్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాకి అచ్చు రాజమణి సంగీతం సమకూర్చారు. ఈ సినిమాను నవంబర్4న విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్