Sunday, January 19, 2025
HomeTrending NewsTDP: చంద్రబాబుకు కీలకం 2024 ఎన్నికలు

TDP: చంద్రబాబుకు కీలకం 2024 ఎన్నికలు

రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మంత్రాంగం చేస్తున్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి రెండో దఫా అధికారం చేపడితే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా ఉంటుందని…వైసిపిని అడ్డుకునేందుకు తన రాజకీయ అనుభవంతో పాఫులు కదుపుతున్నారు. 2024 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అస్త్రశస్త్రాలు సిద్దం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు పూర్తిస్థాయి సహాయ సహకారాలు బాబు అందించారని టాక్ ఉంది. పార్టీ మనుగడకు ప్రమాదం అని తెలిసినా తెలంగాణలో పోటీ చేయకపోవటం వ్యుహాత్మకమని విశ్లేషకుల అంటున్నారు.

తెలంగాణలో వచ్చిన ఫలితాలే ఏపిలో పునరావృతం అవుతాయని, అధికారం తమకే దక్కుతుందని చంద్రబాబు, లోకేష్ ధీమాతో ఉన్నారు. ఈ తరుణంలో ఏ అవకాశాన్ని వదులుకోవద్దని రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ తో ఎన్నికల్లో గెలుపునకు సహకారం తీసుకుంటున్నారు. ఇంత స్వల్పకాలంలో తమకు వీలుకాదని పీకే బృందం చెప్పినా…నానా తిప్పలు పడి ఒప్పించారని సమాచారం. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే  ఏ పార్టీకైనా వ్యూహాలు సిద్దం చేయటం పీకే బృందం నైజం. చంద్రబాబుతో మూడు నెలల ముందు ఒప్పందం చేసుకున్న పీకే…ఏలాంటి ఫలితాలు ఇప్పిస్తారో చూడాలి.

జనసేన అధికంగా సీట్లు డిమాండ్ చేసినా పీకే ద్వారా కట్టడి చేయించే యోచనలో బాబు ఉన్నారని, వారి బృందం సర్వే ప్రకారం నడుచుకుందామని జనసేనానిని సముదాయించవచ్చు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని…ముందే పసిగట్టిన సిబిఎన్…చాకచక్యంగా పవన్ కళ్యాణ్ ను పొత్తుకు ఒప్పించారు. జనసేనకు 25 నుంచి 30 సీట్లు ఇస్తారని లీకులు ఇచ్చారు. క్రమంగా ఆ సంఖ్యకు పవన్ కట్టుబడే విధంగా మీడియాలో హోరెత్తించే పనిలో తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి 30 సీట్ల నుంచి ఎన్ని తగ్గిస్తారో తెలియదని…జనసేనలో ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు.

2019 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బిజెపిని కాదని కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ కూటమితో కొనసాగి బాబు భంగపడ్డారు. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య దూరం అలాగే కొనసాగుతోంది. 2024 ఎన్నికల కోసం బిజెపి ఢిల్లీ పెద్దలు పొత్తు కోసం కొన్నాళ్ళ నుంచి సంకేతాలు పంపుతున్నా సిబిఎన్ ససేమిరా అంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి పురుదేశ్వరికి అప్పగించి… ఆమె ద్వార యత్నించినా ఫలితం లేదని తెలిసింది. బిజెపితో పొత్తు ద్వారా మైనారిటీల ఓట్లు కోల్పోతామని సున్నితంగా బాబు తిరస్కరిస్తున్నారని వినికిడి.

జగన్ ను దెబ్బతీసేందుకు సిబిఎన్ మరో స్కెచ్ వేశారని తెలిసింది. కాంగ్రెస్ లో చేరిన YS షర్మిలను ఏపి శాఖకు అధ్యక్షురాలిని చేసి విస్తృతంగా ప్రచారం చేయిస్తే కొంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. దీంతో వైసిపిని నిలువరించవచ్చని తెలుగు తమ్ముళ్ళు మేధోమథనం చేస్తున్నారు. ఈ దిశగా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనను కార్యాచరణలో పెట్టేందుకు తెలుగు తమ్ముళ్ళు వేగంగా పావులు కదుపుతున్నారు. గురువారం(డిసెంబర్-28) బెంగళూరు తెలుగు సమాఖ్య సమావేశానికి వెళ్ళిన చంద్రబాబు విమానాశ్రయంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను కలిశారు. ఇద్దరు నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చినట్టు సమాచారం.

రాష్ట్రంలో ఈ దఫా కాంగ్రెస్ టికెట్ల పంపిణీ చంద్రబాబు కనుసన్నల్లో జరుగుతుందని హస్తం నేతల అంతర్గత చర్చల్లో వినపడుతోంది. వైసిపిని దెబ్బతీసే స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచార ఖర్చు సైకిల్ ద్వారానే పంపింగ్ జరుగుతుందని పుకార్లు ఉన్నాయి. ఏది ఏమైనా 2024 ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలని, అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో చంద్రబాబు, లోకేష్ లు తీరిక లేకుండా ఉన్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్