Sunday, September 8, 2024
Homeసినిమాశ‌ర్వా ప‌రిపూర్ణ న‌టుడు : అమ‌ల అక్కినేని

శ‌ర్వా ప‌రిపూర్ణ న‌టుడు : అమ‌ల అక్కినేని

హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ఒకే ఒక జీవితం‘.  శ్రీ కార్తీక్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. శర్వానంద్, అమల అక్కినేని, నిర్మాత ఎస్ఆర్ ప్రభు, వెన్నెల కిషోర్, శ్రీకార్తిక్, సుజీత్ ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు.

శర్వానంద్ మాట్లాడుతూ “ఈ సినిమా చూసిన తర్వాత థియేటర్ మొత్తం లేచి చప్పట్లు కొడుతున్నారు. ఇంత కంటే గొప్ప విజయం ఏముంటుంది. దీని కోసమే కదా సినిమాల్లోకి వచ్చామనిపించింది. ఈ సినిమా ఎంత విజయం సాధిస్తుంది, ఎంత కలెక్ట్ చేస్తుందనే అటుంచితే థియేటర్ లో చప్పట్లు వినాలనిపించింది. ప్రేక్షకులు నేను కోరుకున్న ప్రేమని ఇచ్చారు. సినిమా చూసిన అందరూ హత్తుకుంటున్నారు. ఇంతకంటే ప్రేమ ఏం కావాలి. నా చుట్టూ పక్కల వున్న వాళ్ళంతా నేను సక్సెస్ కొట్టాలని కోరుకున్నారు. ఇదే నా మొదటి సక్సెస్.

నన్ను నడిపిస్తున్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమాలో చేసిన అందరూ చాలా డిఫరెంట్ గా అనిపించాం. దీనికి కారణం మా దర్శకుడు శ్రీకార్తిక్. ఇంత గొప్ప కథని రాసిన శ్రీకార్తిక్ కు కృతజ్ఞతలు. అతని మొదటి సినిమాలో భాగమైనందుకు చాలా గర్వంగా వుంది. అమల గారితో పని చేయడం గౌరవంగా వుంది. అమల గారు కనిపించగానే థియేటర్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అమల గారు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సుజీత్ సినిమాని అద్భుతంగా చూపించారు. నిర్మాత ప్రభుగారు ధైర్యం గల నిర్మాత. ఇలాంటి సినిమా చేయాలంటే ధైర్యం వుండాలి.  సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. వర్డ్ ఆఫ్ మౌత్ తో సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రేక్షకులు. ప్రతి షోకి ప్రేక్షకులు డబల్ అవుతున్నారు. ఈ రోజు షోలు మొత్తం ఫుల్ అయ్యాయి. ప్రేక్షకులు, మీడియా మిత్రులు సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సక్సెస్ వారిదే. ప్రేక్షకులకు అందరికీ కృతజ్ఞతలు. ఒకే ఒక జీవితం. ఎంజాయ్ యువర్ లైఫ్” అన్నారు.

అమల అక్కినేని మాట్లాడుతూ.. ఒకే ఒక జీవితం ప్రేక్షకులకు నచ్చింది. అందరూ సినిమాని ప్రశంసిస్తున్నారు. శర్వానంద్ పరిపూర్ణ నటుడు. శర్వాతో వర్క్ చేయడం ఆనందంగా వుంది. రీతూ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి అందరూ చక్కగా చేశారు. శ్రీకార్తిక్ సినిమాకి అద్భుతంగా దర్సకత్వం వహించారు. నిర్మాత ప్రభు గారు చాలా సాహసం గల నిర్మాత. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. సుజిత్ శ్రీజిత్ జేక్స్ బిజోయ్ ఇలా అందరూ చాలా అద్భుతంగా చేశారు. యువత ధైర్యంగా జీవితాన్ని ఎదురుకొని విజయం సాధించే మార్గం చూపే సినిమా ఇది. ఈ సినిమాకి అందరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. ఈ సినిమాని ఎంతో గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు”అని తెలిపారు.

Also Read : కథ కొంచెం .. గ్రాఫిక్స్ ఘనం .. ‘బ్రహ్మాస్త్రం’ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్