Monday, January 20, 2025
HomeTrending Newsఅమెరికా సెనేట్ లో ఆధిక్యం దిశగా డెమోక్రాట్లు

అమెరికా సెనేట్ లో ఆధిక్యం దిశగా డెమోక్రాట్లు

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు, రిపబ్లికన్ పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. దేశాధ్యక్షుడు జో బిడెన్ ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రాటిక్ పార్టీ ప్రతినిధులు వివిధ రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేస్తున్నారు. సేనేట్ రేసులో ఆరిజోనా రాష్ట్రాన్ని డెమోక్ర‌టిక్ పార్టీ సొంతం చేసుకున్న‌ది. దీంతో మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో ఇరు పార్టీలు ప్ర‌స్తుతం 49 సీట్ల‌తో స‌మానంగా నిలిచాయి. ఇంకా నెవ‌డా, జార్జియా రాష్ట్రాల ఫ‌లితాలు రావాల్సి ఉంది. ఆరిజోనాలో డెమోక్రాట్ నేత మార్క్ కెల్లీ విజ‌యం సాధించారు. సేనేట్‌లో ప్ర‌స్తుతం రిప‌బ్లిక‌న్ల వ‌ద్ద కూడా 49 సీట్లు ఉన్నాయి.

నెవ‌డాలో జ‌రుగుతున్న కౌంటింగ్‌లో రెండు పార్టీల మ‌ధ్య హోరాహోరీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే జార్జియాలో మాత్రం మ‌ళ్లీ వ‌చ్చే నెల‌లో ఎన్నిక నిర్వ‌హించ‌నున్నారు. హౌజ్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్‌లో మాత్రం రిప‌బ్లిక‌న్ల‌దే పైచేయిగా నిల‌వ‌నున్న‌ది. సేనేట్‌లో మిగతా రెండు సీట్ల‌ను డెమోక్రాట్లు గెలిస్తే వాళ్ల ఆధిప‌త్యం ఉంటుంది. ఒక‌వేళ ఆ సీట్లు కోల్పోతే అప్పుడు బైడెన్ ప్ర‌ణాళిక‌ల‌ను రిప‌బ్లిక‌న్లు అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి.

అమెరికా కాంగ్రెస్‌కు సంబంధించినవి. కాంగ్రెస్‌లో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ (ప్రతినిధుల సభ), రెండు సెనేట్. కాంగ్రెస్‌ ఎన్నికలను ప్రతి రెండు రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. అమెరికా అధ్యక్షుడికి నాలుగేళ్ల పదవీ కాలం ఉంటుంది. ఆ నాలుగేళ్ల మధ్యలో ఈ ఎన్నికలు పడితే వాటిని మధ్యంతర ఎన్నికలు అంటారు. ప్రస్తుతం అమెరికాలో జో బైడెన్ పదవీ కాలం మధ్యలో ఈ కాంగ్రెస్‌ ఎన్నికలు వచ్చాయి కాబట్టి, వీటిని మధ్యంతర ఎన్నికలు అని పిలుస్తున్నారు.

కాంగ్రెస్ దేశవ్యాప్తంగా చట్టాలు చేస్తుంది. ఏ చట్టాలపై ఓటు వేయాలో ప్రతినిధుల సభ నిర్ణయిస్తుంది. వాటిని ఆమోదించే లేదా నిరోధించే హక్కు సెనేట్‌కు ఉంటుంది. అలాగే, అధ్యక్షుడు చేసిన అపాయింట్‌మెంట్‌లను సెనేట్ నిర్ధరిస్తుంది. చాలా అరుదుగా అధ్యక్షుడికి వ్యతిరేకంగా దర్యాప్తు చేయవచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్