Russia – Ukraine War: ఉక్రెయిన్ – రష్యా యుద్దానికి ఇప్పట్లు ముగింపు కనబడటం లేదు. పైగా రష్యా ఫిరంగులు మరింత గర్జిస్తున్నాయి. అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్ కు ఆర్థికంగా, అంగబలం చేకూరుస్తూ.. రష్యాను కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయన్ కు ఆర్థికంగా, సైనికపరంగా అమెరికా ఎంతో సాయం చేస్తోంది. పెద్ద మొత్తంలో ఆయుధాలను, మందుగుండు సామగ్రిని ఉక్రెయిన్ కు పంపాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిర్ణయించారు.
ఉక్రెయిన్ కు ఆయుధాలను అందించేందుకు అమెరికా సిద్ధం అయింది అని తెలుస్తోంది. ఇక రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ కు అమెరికా స్విచ్ ది బ్లెడ్ డ్రోన్స్ అందించింది. స్విచ్ బ్లేడ్ అనేది కెమెరాలు, గైడెన్స్ పేలుడు పదార్థాలతో కూడిన రోబోటిక్ స్మార్ట్ బాంబ్. ఇక వీటిని కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఆపరేట్ చేస్తూ రష్యా సైనిక యుద్ధ టాంకర్ ల పై దాడి చేసి పేల్చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది నలభై నిమిషాల పాటు ఎగురుతూ 50 కిలోమీటర్లు ప్రయాణించగలవు. వీటిని ఉక్రెయిన్ ప్రజలకు అందించేందుకు అగ్రరాజ్యమైన అమెరికా సిద్ధం కావడం యుద్దాన్ని కొనసాగించటమేనని తెలుస్తోంది.
ఇందులో భాగంగా 800 కోట్ల డాలర్ల విలువైన ఆయుద సామగ్రిని అమెరికా ఇప్పటికే అందించింది. 18 హోవిట్జర్లు (155 ఎంఎం), 40 వేల ఆర్టిలరీ రౌండ్లు, మానవరహిత తీర రక్షక నౌకలు, 500 జావెలిన్ క్షిపణులు, వందల సంఖ్యలో వాహనాలు, 300 స్విచ్ బ్లేడ్లు, 10 ఏఎన్/టీపీక్యూ – 36 ఫిరంగి నిరోధక రాడార్లు, భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి, 11 ఎంఐ-17 హెలికాప్టర్లను పంపబోతోంది. ఈ అత్యాధునిక వ్యవస్థలను ఉపయోగించే విషయంలో ఉక్రెయిన్ సైనికులకు శిక్షణను ఇస్తోంది. ఎంపిక చేసిన ఉక్రెయిన్ సైనికులను తీసుకొచ్చి అత్యంత వేగంగా వారికి శిక్షణ ఇవ్వగా వీరు ఉక్రెయిన్ కు వెళ్లి, సహచర సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు సిద్దమయ్యారు.
తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో దాడులను ముమ్మరం చేయాలని రష్యా నిర్ణయించినట్టు వార్తలు వస్తున్న తరుణంలో అమెరికా తీసుకున్న నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా నిర్ణయం రష్యాకు మరింత ఆగ్రహాన్ని కలిగించే అవకాశం ఉంది. అమెరికా పనికిరాని విదేశాంగ విధానం అనుసరిస్తోందని రష్యా ఘాటుగా విమర్శించింది. రష్యాపై ఆంక్షలు విధిస్తే సమస్య పరిష్కారం కాదని హెచ్చరించింది. ఉక్రెయిన్ కు నాటోలో సభ్యత్వం ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయాని, చివరకు ఇది ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Also Read : కాబుల్ పాఠశాలల్లో పేలుళ్లు, 25 మంది మృతి