ఆఫ్ఘానిస్థాన్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆ దేశంలో అమెరికాకు చెందిన అతి పెద్ద మిలిటరీ బేస్ క్యాంపు ను ఆఫ్ఘన్ ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ మొదలయింది. బాగ్రం ఎయిర్ బేస్ ను తొందరలోనే అప్పగించే పని మొదలవుతుందని అమెరికా రక్షణ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ 11 లోగా ఆఫ్ఘన్ లో బలగాలు ఉపసంహరించుకుంటామని అమెరికా ఇదివరకే ప్రకటించింది. దీంతో యు.ఎస్. రక్షణ వర్గాలు ప్రణాళికా బద్దంగా చర్యలు చేపట్టాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం అమెరికాకు చెందిన మిలిటరీ బేస్ క్యాంపులు, మిలిటరీ వాహనాలు, అయుధాగారాల్ని ఆఫ్ఘన్ సైన్యానికి అప్పగించనున్నారు.