Tuesday, February 25, 2025
HomeTrending Newsహాంకాంగ్‌ పాప్యులర్ సింగర్, నటి కోకో లీ ఆత్మహత్య

హాంకాంగ్‌ పాప్యులర్ సింగర్, నటి కోకో లీ ఆత్మహత్య

హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ గాయకురాలు, పాటల రచయిత, నటి కోకో లీ ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె వయసు 48 సంవత్సరాలు. ఈ విషయాన్ని లీ తోబుట్టువులు కరోల్, నాన్సీ సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు. లీ గత కొన్నేళ్లుగా తీవ్రమైన వ్యాకులత (డిప్రెషన్)తో బాధపడుతోందని, ఇటీవల పరిస్థితి మరింత దిగజారినట్టు పేర్కొన్నారు. దీని నుంచి బయటపడేందుకు విపరీతంగా పోరాడినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నెల 2న లీ ఇంట్లోనే ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారకస్థితిలోకి చేరుకున్న ఆమెను గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే కోమాలోకి చేరుకుంది. చివరికి 5న ఆమె తుదిశ్వాస విడిచింది.హాంకాంగ్‌లో జన్మించిన లీ శాన్‌ఫ్రాన్సిస్కోలో పెరిగింది. ఆ తర్వాత పాప్ సింగర్‌గా కెరియర్‌ను ప్రారంభించింది. తన 30 ఏళ్ల కెరియర్‌లో ఆల్బమ్స్‌ విడుదల చేసింది. 1996లో సోనీ మ్యూజిక్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఆ ఘనత అందుకున్న తొలి చైనీస్ అమెరికన్‌గా రికార్డుకెక్కింది. 1998లో ఆమె విడుదల చేసిన మాండరిన్ ఆల్బం డి డా డి మూడు నెలల్లోనే మిలియన్ కాపీలకుపైగా అమ్ముడుపోయాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్