Sunday, January 19, 2025
Homeసినిమా'అమిగోస్' కోసం రొమాంటిక్ సాంగ్ రీమిక్స్!

‘అమిగోస్’ కోసం రొమాంటిక్ సాంగ్ రీమిక్స్!

యంగ్ హీరోలు చాలామంది గతంలో సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో సూపర్ హిట్ అయిన పాటలను రీమిక్స్ చేస్తూ వెళుతున్నారు. ఆనాటి హిట్ సాంగ్స్ ను మరింత కలర్ ఫుల్ గా .. బ్యూటిఫుల్ గా ఆవిష్కరించడం ఒక ట్రెండ్ గా మారింది. అలా చేయడం సినిమాకి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని వారు భావిస్తూ ఉంటారు. ఆ ఉద్దేశంతోనే కల్యాణ్ రామ్ కూడా ‘అమిగోస్‘ కోసం ఒక రీమిక్స్ సాంగును కొంతసేపటిక్రితం వదిలాడు.

‘ఎన్నో రాతులొస్తాయిగానీ .. రాదే వెన్నెలమ్మా’ అంటూ ఈ పాట సాగుతుంది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1992లో వచ్చిన ‘ధర్మక్షేత్రం’ సినిమాలోని హిట్ సాంగ్ ఇది. ఇళయరాజా స్వరపరిచిన ఈ పాట అప్పట్లో జనం నోళ్లలో ఒక రేంజ్ లో నానింది. బాలకృష్ణ – దివ్యభారతిపై చిత్రీకరించిన ఈ పాట, ఇప్పటికీ ఏదో మూలన వినిపిస్తూనే ఉంటుంది. ఇళయరాజా సూపర్ హిట్స్ లోను ఈ పాట స్థానాన్ని దక్కించుకుంది.

కల్యాణ్ రామ్ – ఆషిక రంగనాథ్ కాంబినేషన్లో ఈ పాటను చిత్రీకరించారు. దర్శకుడు రాజేంద్రరెడ్డి ఈ పాటను బ్యూటిఫుల్ గా ఆవిష్కరించడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. అయితే కొరియోగ్రఫీ పరంగా పాత పాట ప్రభావం నుంచి కొత్త పాట తప్పించుకోలేకపోయింది. చరణ్ – సమీరా భరద్వాజ్ ఆలపించిన ఈ పాట అడియన్స్ ను మరోసారి అలరిస్తుందనడంలో సందేహం లేదు. వచ్చేనెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్