Sunday, January 19, 2025
Homeసినిమామహేష్‌, రాజమౌళి మూవీలో అమితాబ్?

మహేష్‌, రాజమౌళి మూవీలో అమితాబ్?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో భారీ పాన్ వరల్డ్ మూవీ రానుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. జనవరి నుంచి ఈ సినిమాని స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. మహేష్‌ ఇంకా త్రివిక్రమ్ మూవీ కంప్లీట్ చేయకపోవడంతో జక్కన్నతో మూవీ కాస్త ఆలస్యం అవుతుంది. ఈ చిత్రాన్ని జూన్ నుంచి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది.

ఇదిలా ఉంటే… ఈ సినిమా గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. తాజాగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటించనున్నారని.. అది మహేష్ తండ్రి పాత్ర అని టాక్ వినిపిస్తోంది. అలాగే మహేష్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె నటించబోతుందని కూడా ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య మహేష్ కి విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి.  ఇంతకీ ప్రచారంలో ఉన్నది వాస్తవమా అంటే.. నిజానికి ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు అని తెలిసింది.

కాకపోతే.. ఈ సినిమా రచయిత విజయేంద్రప్రసాద్‌ రాసిన కథలో తండ్రి పాత్ర చాలా కీలకం అని.. అందుకే ఆ పాత్రలో అమితాబ్ నటిస్తే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారని సమాచారం. ఇక విజయేంద్రప్రసాద్‌, మహేష్‌ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్టు రాశారట. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని ఆయన ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు. ఈ సినిమా కోసం మహేష్‌ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. 2023 జూన్ లో స్టార్ట్ అయ్యే ఈ సినిమా 2025లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను విడుదల చేయాలి అనుకుంటున్నారు జక్కన్న.

RELATED ARTICLES

Most Popular

న్యూస్