Saturday, January 18, 2025
Homeసినిమాపవన్ సినిమాలో సీనియర్ స్టార్ హీరో!

పవన్ సినిమాలో సీనియర్ స్టార్ హీరో!

పవన్ కల్యాణ్ అభిమానులంతా ‘OG’ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ఇమ్రాన్ హష్మీ .. అర్జున్ దాస్ ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు.

ఈ సినిమాలోని ఒక కీలకమైన పాత్ర కోసం ఒక సీనియర్ స్టార్ హీరోను తీసుకోవాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఈ పాత్రకిగాను అమితాబ్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. ఇటీవల కాలంలో భారీ తెలుగు సినిమాలు .. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి అమితాబ్ ఆసక్తికిని కనబరుస్తున్న సంగతి తెలిసిందే.

ఒకవేళ అమితాబ్ సెట్ కాకపోతే ఆ పాత్రకి మమ్ముట్టిని తీసుకునే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఈ మధ్య కాలంలో మమ్ముట్టి కూడా ఇక్కడి ప్రేక్షకులకు మరింత చేరువైన సంగతి తెలిసిందే.  మరి ఈ ఇద్దరిలో ‘OG’లో ఎవరు కనిపించనున్నారనేది చూడాలి. భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్