Wednesday, February 26, 2025
HomeTrending Newsవిద్యుత్ షాక్ తో ఏనుగు దుర్మరణం

విద్యుత్ షాక్ తో ఏనుగు దుర్మరణం

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కీరమంద, కొల్లదమడుగు అటవీ ప్రాంత వ్యవసాయ భూముల్లో ఓ ఏనుగు విద్యుత్ ఘాతానికి దుర్మరణం పాలైంది.  నీటి కోసం బోరు మోటర్ వద్దకు వెళ్ళిన ఏనుగు నోటితో అక్కడి విద్యుత్ తీగలను తొలగించే ప్రయత్నం చేస్తుండగా షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమికంగా అందిన సమాచారం బట్టి తెలుస్తోంది.  ఏనుగు నోటిలో విద్యుత్ తీగలు ఉండడం ఈ అనుమానాలకు ఊతమిస్తోంది.  స్థానికులు ఏనుగు మృతిపై అటవీ శాఖ అధికారి సమాచారం ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్