వైజాగ్ బీచ్ లో ఓ పురాతన చెక్క పెట్టె నీటిలో కొట్టుకుంటూ ఒడ్డుకు చేరింది. దాదాపు 20 ఏళ్ళ క్రితం నాటి బాక్సు అయి ఉంటుందని పురావస్తు శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఆ బాక్సులో ఏముందనేది ఇప్పుడు అందరి మదినీ తొలుస్తోంది.
గత రాత్రి 11.30 గంటల సమయంలో ఈ పెట్టె కొట్టుకు వచ్చింది. దీన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ ప్రదేశానికి చేరుకుంటున్నారు. ప్రొక్లెయినర్ ను తెప్పించి దాన్ని ఒడ్డుకు చేర్చారు. అధికారుల సమక్షంలో దాన్ని తెరిచేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు.