Sunday, January 19, 2025
Homeసినిమాఅన్నయ్య పేరు నిలబెడతా: ఆనంద్ దేవరకొండ

అన్నయ్య పేరు నిలబెడతా: ఆనంద్ దేవరకొండ

ఈ మధ్య కాలంలో ప్రేమకథలు చాలానే తెరపైకి వచ్చాయి. అయితే వాటిలో ‘బేబి’ ఎక్కువ మార్కులు కొట్టేసింది. 3 రోజుల్లో ఈ సినిమా సాధించిన వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి. యూత్ ఈ సినిమాకి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ను నిన్న హైదరాబాదులో నిర్వహించారు. విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా రాగా, స్పెషల్ గెస్టులుగా అల్లు అరవింద్ .. బన్నీ వాసు .. మారుతి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అందరూ కూడా ఈ సినిమాలో చేసిన నటీనటులను .. సాంకేతిక నిపుణులను అభినందించారు. దర్శకుడు సాయిరాజేశ్ నీలం టేకింగ్ పట్ల ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కావడంతో, సంతోషంతో తాను ఏమీ మాట్లాడలేకపోతున్నానని ఆనంద్ దేవరకొండ అన్నాడు. ఇకపై మంచి సబ్జెక్టులను ఎంచుకుంటూ ..  అన్నయ్య పేరును నిలబెడతానని చెప్పాడు. వైష్ణవి చాలా బాగా చేసిందనీ, విరాజ్ కి కూడా యూత్ లో మంచి పేరు వచ్చిందని అన్నాడు.

ఇక విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. “తన తమ్ముడు సినిమాల్లోకి రావడం తనకి ఇష్టం లేకపోయేదనీ, అయితే ఆ తరువాత తన తపనను అర్థం చేసుకున్నానని అన్నాడు. తన సినిమాల విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదనీ, అందువలన ‘బేబి’ గురించి చివరివరకూ తనకి తెలియదని చెప్పాడు. ఈ సినిమా చూస్తూ తాను చాలా ఎమోషనల్ అయ్యాననీ, ఇలాంటి ఒక కథను ఆనంద్ ఎంచుకోవడం తనకి చాలా హ్యాపీగా అనిపిస్తోందని అన్నాడు. ఇక వైష్ణవికి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ఈ సినిమా తరువాతనే తెలిసిందంటూ ఆమెను అభినందించాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్