Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్మూడో రౌండ్ లోనూ ఆనంద్ విజయం

మూడో రౌండ్ లోనూ ఆనంద్ విజయం

Anand goes on:  భారత చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ నార్వే చెస్ టోర్నీలో తన ఆధిక్యం ప్రదర్శిస్తున్నాడు. నేడు జరిగిన మూడో మ్యాచ్ లో సైతం విజయం సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. చైనా ఆటగాడు వాంగ్ హువో పై రెగ్యులర్ గేమ్ డ్రా కాగా, సడన్ డెత్ మ్యాచ్ లో పుంజుకొని తన ఎత్తులతో ప్రత్యర్థిని ఆనంద్ చిత్తూ చేశాడు.

క్లాసికల్ విభాగం తొలి గేమ్ లో ఫ్రాన్స్ ఆటగాడు మాక్సిమ్ లాగ్రావే పై గెలుపొందిన ఆనంద్, నిన్న జరిగిన రెండో మ్యాచ్ లో బల్గేరియా ఆటగాడు వేసెలిన్ తపలోవ్ పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. నేడు జరిగిన రెగ్యులర్ మ్యాచ్ 39 మూవ్ లతో డ్రా చేసుకున్న ఆనంద్, సడన్ డెత్ మ్యాచ్ ను 44 ఎత్తుల్లో వాంగ్ పై పైచేయి సాధించాడు. ఈ విజయంతో ఏడున్నర పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. సో వెస్లీ (అమెరికా) ఆరు పాయింట్లతో రెండో స్థానం, మాగ్నస్ కార్ల్ సేన్ (నార్వే) ఐదున్నర పాయింట్లతో మూడో స్థానంలోనూ కొనసాతుగున్నారు.

ఈ కాసికల్ ఈవెంట్ కు ముందు జరిగిన బ్లిట్జ్ ఈవెంట్ లో ఆనంద్ ఐదు పాయింట్లు సంపాదించి నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సేన్ ను ఓడించిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్