ప్రకాశం జిల్లా ప్రజల సంక్షేమం కోసం ఆనందయ్య మందును పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నామని రాష్ట్ర విద్యుత్, అటవీ,పర్యావరణ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. బుధవారం స్థానిక ఒంగోలు లోని మంత్రి నివాసంలో ప్రజలకు అనందయ్య కరోనా మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు అనందయ్య కరోనా మందును పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఇప్పటికే ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు రెండుసార్లు కరోనా మందు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. 3వ విడతగా ఈరోజు10 వేల మందికి ప్రజలకు ఆనందయ్య ముందు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అలాగే మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పంపిణీ చేస్తామన్నారు. ఆనoదయ్య కరోనా మందు పై ప్రజలకు విశ్వాసం ఉందన్నారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఏది కోరితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి చెప్పారు.
ఒంగోలులో పూర్తయిన తర్వాత ఇతర నియోజకవర్గాల్లో కూడా పంపిణీకి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. జిల్లాలో అన్ని గ్రామాల్లో సచివాలయాల వాలoటీర్ల ద్వారా ఇంటికి ఇంటికి పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.